Suryaa.co.in

Entertainment

స్వరసరస్వతికి నీరాజనం

నీ లీల పాడెద దేవ..
ఆ పాట జానకిదైనా
ఎన్నో గీతాల్లో
లీలమ్మ లీల..
అమ్మ పాటలా
హాయిగా నిదురపుచ్చే జోల
పదునైదు వేల పాటల అవలీల..!

వింత గాథ వినేందుకు
రావోయి చందమామ
అని కమ్మగా పిలిస్తే
ఎచటి నుంచి వీచెనో
ఈ చల్లని గాలి..
అనుకుంటూ తెమ్మెరనీ
వెంటేసుకు రాడా…
అంతేనా..
ఓహో మేఘమాలా..
నీలాల మేఘమాలా..
చల్లగ రావేల..
మెల్లగ రావేల..
ఇలా మబ్బులకూ
పిలుపు వెళ్ళిందాయె..
ఇంకేమి..మొత్తం
నక్షత్ర మండలమే
దిగిరాదా..
మధుర స్వరం వినగ..
లీలమ్మ పాడుతుంటే ఇంపారగ…!

మధురస్వరాలు ఆంటూ జగదేకవీరుడు పరుగులు తీయగా ఏమి హాయిలే హలా..ఇలా పాడితే కిలకిలా
రాయిగా మారిన రాకుమారుని
గురించి విచారము..
వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని..
పట్టపగలే విరిసేలా ఆమని
పులకించేలా అవని..!

అన్నట్టు..రావోయి చందమామా అనగానే దిగివచ్చిన జాబిలిని
అదే లీలమ్మ ఆటపట్టిస్తూ
మళ్లీ పరుండేవు లేరా..
తెల్లవార వచ్చె తెలియక
నా సామి అనుకుంటూ..!

నీవేనా నను పిలచినది..
నీవేనా నను తలచినది..
అంటూ ఆలపించగనే
చెలికాడు తరలి వస్తే
నీ కోసమె నీ జీవించునది..
అంటూ విరాగాలు పోయినా..
ఇంతకీ ఏముందో తనలో
అదీ తెలియజేస్తూ..
చికిలింత చిగురు..
సంపంగి గుబురు…
చినదాని మనసు..
చినదాని మీద మనసు..
ఆ అల్లరీ..వల్లరీ
అప్పుడప్పుడు లీలమ్మ
గొంతు అంత గడసరి
యమునా నదిలో
లాహిరి లాహిరి..
అపూర్వ స్వరలహరి
గంధర్వ గానఝరి!

వినుడు వినుడు రామాయణ గాథ..
వినుడీ మనసారా..
సముద్రాల వారి రచనకూ
మాస్టారి స్వరరచనకూ
లవకుశుల
మారే వయసుకూ..
అనువైన గళం…
సుశీలమ్మతో జత కట్టి పాడిన పాటలే
లలితా శివజ్యోతికి
సుమంగళం..!
ఎప్పటికీ వినిపించే పాటలు..
తేనెల ఊటలు!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE