పవన్‌ బీజేపీలో చేరి ఉంటే మంత్రి అయ్యేవాడు

– బుక్‌రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగబాబు వ్యాఖ్యలు

తన సోదరుడు పవన్ కల్యాణ్ టీడీపీలోనే, బీజేపీలోనో చేరి ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు తెలిపారు. కానీ పవన్ పదవులపై మక్కువ చూపకుండా, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఏర్పాటు చేశాడని వెల్లడించారు.

పవన్ కల్యాణ్ పై గణ రాసిన ‘ద రియల్ యోగి’ అనే పుస్తకాన్ని నాగబాబు ఆవిష్కరించారు. హైదరాబాదులోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, దర్శకుడు బాబీ, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగబాబు మాట్లాడుతూ, రాజకీయ నాయకుడు అయితే కోట్లమందికి సాయం చేయగలనని భావించాడని, అవినీతిపరులును, లంచగొండులను ప్రశ్నించడానికి పవన్ పార్టీ పెట్టాడని తెలిపారు. అయితే పవన్ తన సోదరుడు కావడంతో ఇంతకుమించి మాట్లాడలేనని పేర్కొన్నారు.

Leave a Reply