Suryaa.co.in

Entertainment

మానవ హక్కులపై సంధించిన అస్త్రం జై భీమ్

లాకప్ డెత్, హత్య నేరారోపణలతో న్యాయవ్యవస్థలో అత్యధిక కాలం విచారణ జరిగిన కేసును ఆధారంగా చేసుకొని జై భీమ్ చిత్రం రూపొందింది. తమిళనాడులో పేద వర్గాలకు ఉచితంగా రికార్డు స్థాయిలో కేసులు వాదించిన అడ్వకేట్ చంద్రు జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని ఈ సినిమాను దర్శకుడు టీజే జ్ఞానవేల్ రూపొందించారు. నటి జ్యోతిక, హీరో సూర్య నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను దీపావళీ కానుకగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నటుడిగా, నిర్మాత సూర్య ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అడ్వకేట్ చంద్రు జీవితం తెరపైన ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే అసలు కథ, కథనాలు గురించి తెలుసుకోవాలి….
జై భీమ్ కథ ఏమిటంటే….
గిరిజన తెగకు చెందిన రాజన్న పాములను పట్టే వృత్తిని జీవనధారం కోసం కొనసాగిస్తుంటాడు. గ్రామంలోని ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో పాము దూరితే దానిని చాకచక్యంగా పట్టిస్తాడు. ఆ రాజకీయ నాయకుడు ఊరు వెళ్లిన క్రమంలో ఆ ఇంట్లో దొంగలు పడటంతో రాజన్నపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే చేయని నేరాన్ని ఓప్పుకోవాలని పోలీసులు లాకప్‌లో చిత్రహింసలు పెడుతారు. ఆ తర్వాత రాజన్నతో పాటు మరో ఇద్దరు లాకప్‌ నుంచి తప్పించుకొన్నారని ఆరోపిస్తూ కేసు నమోదు చేస్తారు. అయితే తన భర్త కనిపించడం లేదని అడ్వకేట్ చంద్రు (సూర్య) ను సంప్రదిస్తారు….
కథలో మలుపు ఏమిటంటే..
లాకప్‌లో రాజన్నకు ఏం జరిగింది?
పోలీసుల చిత్ర హింసలను భరించలేక రాజన్నతో పాటు మరో ఇద్దరు పారిపోయారా?
రాజన్న కోసం కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన అడ్వకేట్ చంద్రు ఈ కేసులో తన వాదనలు వినిపించారు.
ఈ కేసును ప్రభుత్వం తరపున వాదించడానికి వచ్చిన అడ్వకేట్ జనరల్ (రావు రమేష్) చంద్రును ఎలా అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.
కోర్డు డ్రామాలో ఐజీ పెరుమాళ్లు స్వామి (ప్రకాశ్ రాజ్) పాత్ర ఏమిటి?
చివరకు రాజన్న ఏమయ్యాడు?
అనే ప్రశ్నలకు సమాధానమే “జై భీమ్” సినిమా కథ….
మొదటిదశ….
సాధారణంగా రూరల్ పోలీస్ స్టేషన్‌లో చేయని నేరాలు ఒప్పించడానికి పోలీసులు ఎవరో ఒకరిని బాధితుడిగా చేయడం లాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. తమిళనాడులో జరిగిన
ఓ కేసు విచారణ..
లాకప్ డెత్…
పేదలు కోసం న్యాయం అందించే అంశాలతో సినిమా ఎమోషనల్‌గా మొదలువుతుంది. రాజన్న..
గర్బిణిగా ఉన్న ఆయన భార్య…
ఐదేళ్ల కూతురు తో….
కూడిన కథ ఆసక్తికరంగా మొదలువుతుంది. రాజన్నను పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ పద్దతులను ఉపయోగించే సీన్లు హృదయాన్ని పిండేలా చేస్తాయి.
మొదటి దశ ఇలాంటి అంశాలతో ప్రతీ సీన్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేయడమే కాకుండా ప్రతీ క్షణం ఆలోచింప చేస్తుంది…
అడ్వకేట్ చంద్రు సూర్య పాత్ర మధ్య మధ్యలో ప్రజల సమస్యలు , ప్రజల హక్కుల ఉల్లంఘన లాంటి అంశాలపై కమ్యూనిస్టుల ఆందోళనలు, పోరాటాలు, కరపత్రం ప్రచారం , న్యాయపరంగా సమస్యలు పరిష్కారం … కేసులను ప్రత్యక్షంగా జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలన ఎంతో స్ఫూర్తి దాయకం…
లాయర్ పై ఎస్ఐ చెయ్యిచేసుకున్నందుకు నిరసనగా జరిగిన లాయర్ల ఆందోళన సంధర్భంగా ప్రకాష్ రాజ్ సూర్య కి మధ్య జరిగిన సంభాషణ పోలీసులు అందరూ నేరస్తులు కాదు . ప్రజా సమస్యలపై పోరాడుతున్న మీరు ఆ దృష్టితో చూడద్దు అనే చర్చ ఇలా అనేక విషయాలు ….
రెండవ దశ….
అడ్వకేట్ చంద్రుగా సూర్య…
అడ్వకేట్ జనరల్‌గా రావు రమేష్… నిజాయితీతో కూడిన పోలీస్ ఆఫీసర్‌గా ప్రకాశ్ రాజ్ ….
పవర్‌పుల్‌గా కనిపిస్తారు.
కథను అనేక మలుపు తిప్పుతూ సినిమాను ప్రతీ ఎపిసోడ్‌కు మరో లెవెల్‌కు తీసుకెళ్తారు. రావు రమేష్, సూర్య మధ్య సన్నివేశాలు పోటాపోటీగా సాగుతాయి.
కేసును విచారణ చెయ్యడానికి సిబిఐ విచారణ అని చర్చ సంధర్భంగా ఇటీవల జరిగిన ఘటనల్లో సిబిఐ విచారణలు ఎన్ని పూర్తియినవి అని జడ్జీలు అడిగినప్పుడు సూర్య ఈ కేసు విచారణకు ఐజి ప్రకాష్ రాజ్ ని నియమించాలని సీక్రెట్ గా స్లిప్ రాసి ఇవ్వగా జడ్జీలు అంగీకరించిన తీరు …
మీ విచారణ వలన ప్రభుత్వ పరువు పోకుండా చూడండని డిజిపి ఫోను చెయ్యడం …
బాధితులను కేసు ఉపసంహరణ చేసుకొమని మాట్లాడండని డిజిపి ఐజిని కోరినప్పుడు నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని చెప్పడం ….
ప్రకాశ్ రాజ్ పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా స్వరూపమే మారిపోతుంది…
ప్రకాశ్ రాజ్ కనిపించే ప్రతీ సీన్‌ను గుండెను తట్టి లేపుతుంది….
ప్రత్యక్షంగా పరిశీలన చెయ్యడం , దేనికి తలవంచకుండా కోర్టులో రిపోర్ట్ సమర్పించడం ఎంతో హూందగా ఉంది…
కోర్టు రూమ్ డ్రామా అద్యంతం ఆలోచింప చేస్తుంది…..
రాజన్న భార్యను డిజిపి పిలిపించి కేసు వాపసు తీసుకోండి ముద్దాయిలతో నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పినప్పుడు రాజన్న భార్య కడుపులో ఉన్న బిడ్డ పుట్టిన తర్వాత నాన్న ఎక్కడ అని అడిగితే జరిగిన విషయం తెలుసుకున్న బిడ్డ నేరం చేసిన వారి డబ్బులతో మమ్మల్ని పోషించావా అని అడిగితే భరించే శక్తి నాకు లేదు . పోరాటం చేసి ఓడిపోతాను అని చెప్పిన మాట పేదల ఆత్మ గౌరవానికి నిప్పేందుకు దారితీసింది…
డిజిపి లాంటి అధికారి ప్రజలకు జరగాల్సిన న్యాయం గురించి కాకుండ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడని తప్పు చేసిన అధికారులను కాపాడే తాపత్రయం ఇందులో చూపిస్తారు …
అడ్వకేట్ జనరల్ తప్పుచేసిన ప్రభుత్వ అధికారులను కాపాడే ప్రయత్నాలు ఎన్నికల్లో ఎంపి సీటు వస్తుందని కేసు ఓడిపోతే సీటు రాదని తప్పులను కాపాడేందుకు ఎన్ని రకాల అబద్ధాల సాక్షులను ప్రవేశపెట్టిన తీరు కళ్లకు కట్టినట్లు చూపించారు …
దొంగ తనం నేరం కింద అరెస్టు…
దొంగ తనం నేరం ఒప్పుకోమని చిత్రహింసలు..
రకరకాల చిత్ర హింసలు…
చిత్రహింస సంధర్భంగా చనిపోతే కప్పిపుచ్చుకునేందుకు తప్పులు మీద తప్పులు చెయ్యడం…
తప్పు చేసిన ప్రభుత్వ అధికారులను కాపాడేందుకు పై అధికారులు పడే తాపత్రయంలో వాళ్లు తప్పులు చెయ్యడం లాంటి విషయాలు బాగా చూపుతారు…
కేసులను కోర్టు ఎంత ఓపికగా విచారణ జరిపిన తీరు ….
తప్పు చేసిన ప్రభుత్వ అధికారులకు శిక్ష….
చట్ట పరమైన నష్టపరిహారం కింద పట్టా , ఇళ్ల నిర్మాణం , పొలం , ఎక్స్ గ్రేషియా అందించడం….
న్యాయాన్ని కాపాడేందుకు నిలబడిన పోలీస్ అధికారి ఐజి , అడ్వకేట్ సూర్య లను అభినందించటం…..
కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా పేపర్ చదువుతున్న లాయర్ చంద్రు సూర్యను చూస్తూ అలాగే చెయ్యాలని భయభయంగా చేయ్యపోయిన రాజన్న కూతురుని చూసి నవ్వుతూ కానివ్వు అన్న సైగ్ తో నవ్వుతూ కాలు మీద కాలు వేసుకుని పేపర్ చదవటంతో కధ ముగుస్తుంది…
దర్శకుడి ప్రతిభ గురించి
వాస్తవిక సంఘటనలను కథగా రాసుకొన్న విధానం, కథను నడిపించిన విధానం దర్శకుడు టీజే జ్ఞానవేల్ ప్రతిభకు అద్దం పట్టింది. సూర్యను కంప్లీట్‌గా పాత్రలోకి ప్రవేశపెట్టి అతడి నుంచి రాబట్టుకొన్న తీరు సినిమాకు అత్యంత బలంగా మారిందని చెప్పవచ్చు. రాజన్న లైఫ్‌స్టైల్, రొమాంటిక్ జీవితం ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇక సహజంగా చిత్రీకరించిన కోర్డు రూమ్ డ్రామా ఫుల్ ఎమోషనల్‌గా కనిపిస్తుంది. ఇటీవల వచ్చిన కోర్టు రూమ్ డ్రామా సినిమాలకు బైబిల్‌గా మారిందని చెప్పవచ్చు.
అడ్వకేట్ చంద్రుగా సూర్య అద్భుతంగా
అడ్వకేట్ చంద్రుగా సూర్య అద్భుతంగా కనిపించాడు. పాత్రకు తగినట్టుగా, సన్నివేశాలకు అనుగుణంగా చూపించిన హావభావాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతాయి. కోర్టులో చంద్రు పాత్ర బిహేవ్ చేసిన విధానం సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. ప్రతీ సినిమాకు సూర్య ప్రతీసారి కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించిన తీరు నటనపట్ల ఆయన అంకితభావానికి అద్దం పట్టిందని చెప్పవచ్చు. మరోసారి సూర్య తన పాత్రలో జీవించాడని చెప్పవచ్చు.రావు రమేష్, ప్రకాశ్ రాజ్ పాత్రల గురించి
అడ్వకేట్ జనరల్ పాత్రలో రావు రమేష్ బాడీ లాంగ్వేజ్ కొత్తగా కనిపించింది. ప్రకాశ్ రాజ్ నిజాయితీ ఆఫీసర్‌గా తన పాత్రలో చెలరేగిపోయాడు. ఈ రెండు పాత్రలు సినిమా బలంగా మారాయి. రాజన్న పాత్ర, ఆయన భార్య ఇతర పాత్రల్లో నటించిన వారు గొప్ప అనుభూతిని పంచుతారు. సూర్యతో కలిసి రజీషా విజయన్, రాజన్న భార్యగా లిజోమోల్ జోస్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
టెక్నికల్ విభాగం పనితీరు
సాంకేతిక విభాగానికి వస్తే.. ఎస్ఆర్ కదిర్ సినిమాటోగ్రఫి బాగుంది. కోర్టు సీన్లనే కాకుండా మున్నార్ లాంటి ప్రదేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. సీన్ రోల్డాన్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా సిట్యుయేషన్ తగినట్టుగా ఉంటాయి. కొన్ని పాటలు హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది.ఫైనల్‌గా
నిర్మాతలుగా, సూర్య, జ్యోతిక పాటించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వాస్తవ సంఘటనలను పరిశోధన చేసి కథ, కథనాలుగా మలిచిన తీరుతోనే సినిమా సక్సెస్ బాట పట్టింది. ఇక పాత్రలకు తగినట్టుగా నటీనటుల ఎంపిక సినిమాకు మరో సక్సెస్ ఫార్మూలాగా మారింది. గ్రామీణ వాతావరణం నేపథ్యంగా రూపొందించిన సన్నివేశాలు అతిసన్నిహితంగా ఉన్నాయి. సూర్య నటన, భావోద్వేగమైన కథతో కొత్త అనుభూతిని పొందాలనుకొనే వారు జై భీమ్ సినిమాను తప్పకుండా చూడాలని కోరుతూ….
జై భీమ్ రియల్ చంద్రు స్టోరీ క్లుప్తంగా:-
జస్టిస్ చంద్రు ఎప్పుడూ ఒక కారణంతో తిరుగుబాటుదారుడే. తన కళాశాల రోజుల్లో, అతను CPI(M)లో చేరడానికి ముందు స్టూడెంట్స్ సోషలిస్ట్ ఫోరమ్ (SSF)ని నడిపాడు, అక్కడ అతను మరియు అతని స్నేహితులు సిపిఎం విద్యార్థి విభాగం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో చేరారు.
చెన్నై సెంట్రల్ జైలులో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన దురాగతాలను విచారిస్తున్న జస్టిస్ ఇస్మాయిల్ కమిషన్ ముందు సీపీఐ(ఎం) తరపున హాజరైనప్పుడు ఆయనపై మళ్లీ దృష్టి పడింది.

– కెవిపిఎస్

LEAVE A RESPONSE