Home » జ్ఞాన’వేలు…నీకు జై భీమ్ !

జ్ఞాన’వేలు…నీకు జై భీమ్ !

ఎన్నో సార్లు బాధతో ఏడ్చాను…
సంతోషం తో ఏడ్చాను..
మొట్ట మొదటి సారి పౌరుషం తో
కన్నీళ్లు కార్చ.
భాష ఏదైతే నేమి,
భావం మాత్రం మనసును కదిలిస్తుంది..
జ్ఞాన’వేలుతో మా గుండెల్లో గుచ్చావ్…
భారత దేశ చరిత్రలోనే అత్యున్నత సన్నివేశం..
ఇంకో వందేళ్లు అయినా తెలుగు సినిమా..
తమిళ సినిమా స్థాయిని అందుకోలేదు..
జై భీమ్
అద్భుతమైన సన్నివేశం..
గ్రాఫిక్స్ గాలల్లకు..
గాయ’పు గాళ్లకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది..
జై భీమ్..
ఒక్క కుర్చీ విరక్కుండా ,
ఒక్కటంటే ఒక్క ఫైటింగ్ సీన్ లేకుండానే హీరోయిజం చూపించవచ్చు అని తెలుగు డైరెట్టర్లు ఎప్పటికి గ్రహించేను ..
ఏ నకరాలూ చెయ్యకుండా , ఏ ఫారిన్లోనూ గెంతకుండానే తమ అభిమాన నటుడు హీరోగానే కనబడవచ్చు అని ఈ చిల్లర ప్రేచ్చక దేవుళ్ళకు తెలిసేది ఎప్పుడో ..
అయ్యా జ్ఞానవేలు సారూ , జై భీం సినిమాని తెలుగులో కూడా తీసి ఆ ద్దగు బాటి కుటుంబం మళ్ళీ ట్రైబల్ సమాజం అంటే అన్ని కులాల్లోని పేదలే అని మానెత్తిన రుద్దే దబాయింపునుండి మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనం !
సినిమా టైటిల్ జై భీం అని తెలియగానే అది తప్పకుండా అలగాజనం చేసే అనవసర రచ్చ అని డిసైడ్ అయ్యి సినిమా చూడకుండా కూర్చున్న ఓపెన్ కులగజ్జి స్నేహితులకు, జై భీం అంటే ఏదో మాలా మాదిగ దళితుల గోలే ఉంటుందిలే అని అనుమానంతో చూసి, ఇదంతా ట్రైబల్స్ గురించిన కథ అని తెలిసి హమ్మయ్యా అని వూపిరి పీల్చుకున్న ముసుగు దొంగలకు కూడా నీల్ సలాం . ఏది ఏమైనా నోటివెంట జై భీం అనే నినాదం పలకాలంటే గొంతులో ఆవపెట్టిన పచ్చి పనసకాయ పడే సనాతన అభ్యుదయ వాదులు, కనీసం సినిమా టైటిల్ చెప్పడానికైనా ఆ పదాన్ని ఉచ్ఛరించే అగత్యం పట్టించిన డైరెక్టర్ , నిర్మాతలకు వేవేల జై భీములు !
జ్ఞాన’వేలు…
నీకు
నా
జై భీమ్

– అద్దంకి సుధీర్

Leave a Reply