Suryaa.co.in

Entertainment

డ్రగ్స్ ఘటనలో నిహారికకు సంబంధం లేదు:- నాగబాబు

హైదరాబాద్‌:-పబ్‌లో డ్రగ్స్ ఘటనకు సంబంధించి తన కుమార్తె నిహారికకు సంబంధం లేదని నటుడు నాగబాబు స్పష్టం చేశారు. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

‘‘పబ్‌లో డ్రగ్స్‌ ఘటనపై నేను స్పందించడానికి ప్రధాన కారణం ఆ సమయానికి నా కుమార్తె అక్కడ ఉండటమే.పబ్‌ను సమయవేళల పరిమితికి మించి నడిపారని పోలీసులు చర్యలు చేపట్టారు.ఇందులో నా కుమార్తె నిహారికవైపు ఏ తప్పూ లేదు.నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు కూడా చెప్పారు. మీడియాలో అవాస్తవాలకు తావు ఇవ్వకూడదనే నేను స్పందిస్తున్నా’’ అని నాగబాబు వెల్లడించారు.

LEAVE A RESPONSE