వ్యక్తిగతంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంటే చాలా అసహ్యం, కానీ, వ్యూహాత్మకంగా భారత్ కి చాలా మంచిపని చేశాడు, మనమెన్నాళ్ళుగానో కష్టపడి సాధించలేనిది, ఇతగాడు రెండుమూడేళ్ళలో సాధించి మనకు చెప్పలేని సాయం చేశాడు.
ఎలా అంటే..
1). అమెరికా, యూరోప్ వంటి పాశ్చాత్య దేశాలదృష్టిలో పాకిస్తాన్ ని ఒక రోగ్ స్టేట్ గా మార్చేశాడు. ఈతని అనుచరులు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల్లో కామెంట్ చేసి మొత్తం ప్రజాస్వామ్య దేశాల దృష్టిలో జోకర్ గా మారేలా చేశాడు.
2). సైన్యం అండదండలతో ఎన్నికైనందున , సైన్యానికి అదేపనిగా ఆర్థిక అండదండలందించి దేశాన్ని ఆర్థికంగా చితికేలా చేశాడు. కనీసం కరోనా వ్యాక్సిన్ లు కొనలేనంతగా., ఆర్థిక వ్యవస్థను చిన్నచిన్న ఆయుధాలు కానలేనంతగా దిగజార్చాడు .
3). సౌదీ అరేబియా కు రెండోప్రాణంగా ఉన్న పాకిస్తాన్ ను, సౌదీ నుండి వేరు చేయడమంటే మామూలు విషయం కాదు.
ఓఐసీ దేశాలకు అధ్యక్షత వహిస్తానని, టర్కీ చెంత చేరి, అరేబియా ద్వీపకల్ప దేశాల అధిపత్యాన్ని అంతం చేస్తానని.. మింగమెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె లాంటి మాటలకోటలు చాలా కట్టి పాకిస్తాన్, పాలు పోసే చేయిని కాటువేసే పామని అరేబియా ద్వీపకల్ప దేశాలు దూరమయ్యేలా చేశాడు.
4). కరోనా కాలంలో చైనా చంకచేరి ట్రంప్ హయాంలోనూ, రష్యా పర్యటించి రష్యాకు బహిరంగ మద్దతు పలికి, రష్యా, చైనా,ఇరాన్, ఉత్తర కొరియా కూటమి అంటూ పేలి బైడెన్ హయాంలోనూ అమెరికా దృష్టిలో పాకిస్తాన్ ని బకరా చేశాడు.
5). చివరికి చైనా,రష్యాలు కూడా పాకిస్తాన్ ను కరివేపాకులా వాడిపడేయాలనుకున్నవే, వాటి దృష్టిలో భారత్ కున్న విలువలో , పాకిస్తాన్ కు పదోవంతు విలువ లేదని అందరికి అర్థమైనా.. మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ పాకిస్తాన్ ప్రజల ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ దేశాన్ని ఎర్రి పప్పు చేశారు.
6). ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఏదో ఉద్దరిస్తున్నానని ఆర్మీకి సహాయం చేసి, జనాన్ని నమ్మించి పాకిస్తాన్ నెత్తిన మరో పెద్ద దరిద్రాన్ని రుద్దాడు.
ఇలా పాకిస్తాన్ ను ఏ బయటి శత్రువూ నాశనం చేయలేనంత దారుణంగా.. తెలియక, తప్పనిసరి పరిస్థితుల్లో నాశనం చేసిన ఇమ్రాన్ భారత్ కి అదృశ్య మిత్రుడు.
ఇతను ఇలాగే ఇంకా పాకిస్తాన్ ని నాశనం చేసే అవకాశం మనం మిస్ అవుతున్నాము. జనరల్ బాజ్వా చాలా నిగూఢంగా, అమెరికా పలుకులు చిలకలాగా పలుకుతున్నాడు.
మరి
1).అమెరికా సైనిక పాలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
2). ముజాహిదీన్ లకు మళ్ళీ ప్రాణం పోస్తాడా?
3). రష్యా, భారత్ ల మీదకే ఈ కిరాయి ముజాహిదీన్ ల పోరాటాన్ని పరిమితం చేస్తాడా? లేక, చైనా వరకూ విస్తారిస్తాడా?
4). ఆఫ్ఘనిస్తాన్ ని మళ్ళీ ముల్లు లాగా వాడుకొని మొత్తం ఆసియాని రక్తపుటేరులలో ముంచేస్తాడా?
5). మరి, చైనా ఈ కుట్రను గ్రహించిందా? గ్రహించే తన డబ్బులు వాపస్ ఇచ్చేయమంటుందా? లేక, ఇండియా, రష్యా ల చితిమంటల మీదుగా తన చితిని పేర్చుకుంటుందా?
6). జపాన్, కొరియా, సౌదీ, ఇజ్రాయెల్ లు ఇంకా గంగిరెద్దుల్లాగానే ఉండాలనుకుంటున్నాయా?
అంతిమ ప్రశ్న ఏంటంటే,
అమెరికా తన దరిద్రాన్ని పాకిస్తాన్ మీద మోపుతుందా? లేక, పాకిస్తాన్ దరిద్రాన్ని తననెత్తికెత్తుకుంటుందా అనేదే?
మొత్తానికి ఇద్దరు సన్నాసులు రాసుకుంటే మిగిలేది బూడిదే అన్నది వీళ్లకు ఎవరుచెప్పాలి ?
– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిలభారత ఓసి సంఘం
మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్
జాతీయ అధ్యక్షుడు