చోరీ కేసులో తెలుగు నటి సౌమ్య శెట్టిని అరెస్ట్

విశాఖ : కేజీ బంగారం చోరీ కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రసాద్ కుమార్తెతో పరిచయం పెంచుకుని ఇంట్లోకి ప్రవేశించి పక్కా ప్లాన్తో ఆమె ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ద ట్రిప్, యువర్స్ లవింగ్లీ సహా పలు మూవీల్లో సౌమ్య నటించింది.

 

Leave a Reply