Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే లక్ష్యంతో ఏర్పాటై, 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 43వ వసంతంలోకి అడుగు పెట్టడంపై పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ, జాతీయ భావాలతో జాతి అభివృద్ధి కోసం పాటు పడింది. కేంద్రంలోనూ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. రాక్షస పరిపాలనకు, రాజ్యాంగ వ్యతిరేక పాలనలను అంతమొందించి ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన నాయకుడు ఎన్టీఆర్.

సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి అజెండాతో రాష్ట్రాన్ని అభ్యున్నతి మార్గంలో నడిపించంది. కూడు గూడు గుడ్డ నినాదంతో పేదలకు అండగా నిలిచారు. పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పేదల అభివృద్ధే అజెండాగా నాడు ఎన్టీఆర్ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించారు. అదే స్ఫూర్తిని, అదే నినాదంతో ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించిన నాయకుడు చంద్రబాబు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా నడచుకునే తెలుగుదేశం పార్టీ మరో వసంతంలోకి అడుగు పెట్టడం సంతోషకరమని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీని నాడు ఏ పరిస్థితుల్లో స్థాపించారో ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు కూడా రాష్ట్రంలో నెలకొంది. తెలుగుదేశం కావాలంటూ ప్రజలు నినదిస్తున్నారని నేతలు పేర్కొన్నారు. మరో 45 రోజుల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందన్నారు.

కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్, జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, నూజివీడు టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్థసారధి, నాలెడ్జి సెంటర్ ఛైర్మన్, జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, సీనియర్ నాయకులు ఎ.వి.రమణ, వేమూరి ఆనందసూర్య, బుచ్చిరాం ప్రసాద్, వీరంకి వెంకట గురుమూర్తి, మన్నవ సుబ్బారావు, పిల్లి మాణిక్యరావు,కోడూరి అఖిల్, శంకర్ నాయుడు,మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరుల నాయకులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE