డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీని ఎన్నికల విధుల నుంచి తొలగించాలి

– రాష్ట్రాన్ని జగన్ రెడ్డి, విద్యా వ్యవస్థను ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ భ్రష్టు పట్టించారు
– ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులను ఎన్నికల కోడ్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వినియోగించడానికి లేదు
– వెంటనే ఆర్టీసీ బస్సులను వెనక్కి పంపాలి
– తెదేపా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంలో ఉదాసీనం
– శ్రీ కాళహస్తి డంపు స్వాధీనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి కలెక్టర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి
– ఎన్నికల కోడ్‌ను బేఖాతరు చేస్తున్న అధికారులు
– శ్రీ కాళహస్తిలో దొరికిన డంప్‌పై సమగ్ర విచారణ జరపాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తెదెపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

ఎన్నికల కోడ్‌ను బేఖాతరు చేస్తున్న అధికారులు, శ్రీ కాళహస్తిలో దొరికిన డంప్‌పై సమగ్ర విచారణ జరపాలని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కోడూరు అఖిల్ ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కొందరు అధికారులు ఇంకా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని, అటువంటి వారపై తగిన చర్యలు తీసుకొని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చేడాలని ఈసీని కోరిన వర్ల రామయ్య. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్
“రాష్ట్రాన్ని జగన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తే విద్యా వ్యవస్థను ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ భ్రష్టు పట్టించారు. జగన్ రెడ్డికి భజన చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ అగ్రగామి. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఏప్రిల్ 2న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల విద్యార్ధుల తల్లిదండ్రులతో ఆన్‌లైన్ మీటింగ్ పెట్టి, జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయండని అడగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని…కావున ఈ మీటింగ్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరాం” అని తెలిపారు.

ఎన్నికల కోడ్ వచ్చినా ప్రభుత్వ సొమ్ముతో జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారం

“ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సెక్యూరిటీ వాహనాలను వాడుకునే అధికారం కేవలం ఒక్క ప్రధానమంత్రికి మాత్రమే ఉంది. కానీ రెండు రోజుల నుంచి జగన్ రెడ్డి దర్జాగా ఆర్టీసీ తయారుచేసిన రెండు బుల్లెట్ ప్రైఫ్ బస్సులో తిరుగుతున్నాడు. ప్రభుత్వ బస్సులో ఎన్నికల ప్రచారం చేసే అధికారం జగన్ రెడ్డికి లేదు. జగన్ రెడ్డికి Z+ క్యాటగిరీ సెక్యూరిటీ కూడా లేదు. అందుకే జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఆర్టీసీ పంపించిన రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను వెంటనే వెనక్కి పిలిపించండని.. బస్సులను పంపించిన ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని.. ఇన్ని రోజుల బస్సులను వాడుకున్నందుకు గాను జగన్ రెడ్డి దగ్గర నుంచి ఛార్జీలు వసూలు చేయండని సీఈవోకు విజ్ఞప్తి చేశాం” అని తెలిపారు.

వాలంటీర్లు విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలి

“ఏప్రిల్ 1న పింఛను పంపిణీ చేసేటప్పుడు వాలంటీర్లు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలి తప్ప వైసీపీకి ప్రచారం చేసే రీతిలో ఉండకూడదు. వాలంటీర్లు జగన్ రెడ్డికి బానిసలు కాదు. వారు ప్రజలకు మాత్రమే జవాబుదారిలు. ప్రజలకు మాత్రమే వాలంటీర్లు సేవ చేయాలి. మేమెప్పుడు వాలంటీరు వ్యవస్థకు వ్యతిరేకం కాదు. సమగ్ర, మెరుగైన రీతిలో వారి సేవలను మేము వినియోగించుకుంటాం” అని హామీ ఇచ్చారు.

పట్టపగలే మా కార్యకర్తలపై దాడులు – పట్టించుకోని పోలీసులు

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తెదెపా నేతలపై వైసీపీ నేతలు 18 దాడులు చేశారు. ఆ దాడుల్లో ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. వైసీపీ వారిని అరెస్ట్ చేస్తే డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి నచ్చదు. వైసీపీ నాయకులు ఎంత పెద్ద నేరం చేసినా వారిని అరెస్ట్ చేయవద్దని రీతిలో డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడిజి ఆంజనేయులు వ్యవహారశైలి ఉంది. అందుకే వారిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టండని ఈసీని కోరాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిద్దరిపై తప్పకుండా సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

శ్రీ కాళహస్తిలో దొరికిన డంప్‌పై సమగ్ర విచారణ జరపాలి

“ఎన్నికల ప్రచారానికి వాహనాలు పర్మిషన్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారు. వెంటనే పర్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోండని ఈసీకి తెలిపాం. ఓటర్లు ప్రభావితం చేయగల కోట్లాది రూపాయిల డంప్‌ను శ్రీ కాళహస్తిలో పట్టుకున్నారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆ మెటీరియల్ మొత్తం ఎవరివని విచారణే జరపలేదు.

ఆ డంప్‌ను మా కార్యకర్తలు పట్టుకున్నందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ తెగ బాధ పడిపోతున్నారు. ఎన్నికల విధుల్లో ఉండే అర్హత తిరుపతి కలెక్టర్‌కు లేదని, అతన్ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సీఈవోను కోరాం. దాంతో పాటు ఆ డంప్‌పై పూర్తి స్థాయి విచారణ జిరిపి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం” అని వర్ల రామయ్య తెలియజేశారు.

Leave a Reply