జిల్లాలో ”స్వీప్’ కార్యక్రమాలపై సంతృప్తి

– కలెక్టరెట్ లో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శన, స్టాల్ ను తిలకించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

ఏలూరు, మార్చి , 29 : జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం జిల్లాకు విచ్చేసిన సీఈఓ ఏలూరు కలెక్టరేట్ లో జిల్లాలో ఓటుహక్కుపై ఓటర్ల అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓటర్లను చైతన్య పరిచేందుకు ‘స్వీప్ ‘ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన సూచించారు.

Leave a Reply