Suryaa.co.in

Andhra Pradesh

అవ్వాతాతలకు రూ.3వేలు పెన్షన్ ఇవ్వలేని జగన్ రెడ్డి..మూడు రాజధానులు కడతాడా.?

-ఏటేటా సామాజిక పింఛన్లకు కోతపెడుతున్న ముఖ్యమంత్రి, మూడేళ్లలో 60లక్షల ఓట్లు పెరిగాయనడం అనుమానాలకు తావిస్తోంది
-చంద్రబాబునాయుడి హాయాంలో 55లక్షలమందికి పింఛన్లు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి 50లక్షలకే పరిమితమయ్యాడు
-ఒక ఇంటిలో ఒకరికే పింఛన్ అంటున్న జగన్మోహన్ రెడ్డి, పదవుల్లోకూడా అదేవిధానాన్ని ఎందుకు అమలుచేయడంలేదు?
-టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు

ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు, వంచనలు, దారుణాలతో ముగిసిందని, రాబోయే కొత్తసంవత్సరంలోకూడా ఆయన తనదైనశైలిలో ప్రజలను వంచించడం, వారిని లూఠీ చేయడం వంటి కార్యక్రమాలనే కొనసాగిస్తున్నాడని, రూ.3వేల పింఛన్ ఇస్తానని అవ్వాతాతలను మూడేళ్లపాటు నిర్విరామంగా మోసగించిన జగన్మోహన్ రెడ్డి, 2022లో కూడా తనవాగ్ధానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరా వు స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

అధికారంలోకి వస్తే రూ.3వేల పింఛన్ ఇస్తానని చెప్పి అవ్వాతాతలను నిలువునా వంచించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక అబ్బెబ్బే తాను అలా అనలేదని బుకాయించి, కేవలం రూ.250లు మాత్రమే పెంచి, సామాజిక పింఛన్లను రూ.2250కే పరిమితం చేశాడు. మూడేళ్లపాటు 2,250రూపాయలేఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఈ జనవరి నుంచి దాన్ని రూ.250లు పెంచి, రూ.2,500లు ఇస్తున్నట్లు ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి రేపటినుంచి ఇవ్వబోయే పింఛన్లకు కోట్లాదిరూపాయల సొమ్ముని ప్రచారానికి తగలేశాడు. తొలినాళ్లలో రూ.250లు పెంచామనిచెప్పి చేసిన ప్రచారానికి, ఇప్పుడు చేస్తున్న ప్రచారానికి చేసిన

ఖర్చుని అవ్వాతాతలకు ఇచ్చిఉంటే, ఆయన గతంలో ఇచ్చినట్లుగా రూ.3వేల పింఛన్ వాగ్ధానాన్ని నిలబెట్టుకునేవాడు. సొమ్ముపెంపులో వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి, పింఛన్ లబ్ధిదారుల సంఖ్యలో మాత్రం ఏటేటా కోతపెడుతున్నాడు. అదే విధంగా 2022లో ఎంతమంది అవ్వాతాతలచేతుల్లో బొచ్చెలు పెడతాడో చూడాలి. పింఛన్లు పెంచుకుంటూ పోతాననిచెప్పి, తనచచ్చుముఖం ఫోటోలతో కూడిన ప్రకటనలతో కోట్లాది రూపాయల సొమ్ముని ప్రచారానికి తగలేశాడు.

తెలుగుదేశంప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గారు తాను దిగిపోయేనాటికి 2019 మేనాటికి 54.25లక్షలమందికి పింఛన్లు అందించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగునెలల్లోనే 6లక్షల పింఛన్లకు కోతపెట్టాడు. పింఛన్లు పొందేవారికి భూమి ఉందని, పొలమందని, వారిపిల్లలకు ఉద్యోగాలుఉన్నాయని, ఒకఇంట్లో ఒకరికే పింఛన్ అని సవాలక్షనిబంధనలతో, సామాజికపింఛన్లలో దారుణంగా కోతపెట్టాడు. ఒకఇంట్లో ఒకరికే ఫించన్ అనిచెప్పిన వ్యక్తి, ఒకేఇంటిలో ఉండే తనపార్టీవారికి రెండు, మూడు పదవులు ఎం దుకు ఇచ్చాడో సమాధానంచెప్పాలి. రాష్ట్రంలో పింఛన్లు పొందడానికి అర్హులైన వారు దాదాపు 60లక్షలపైచిలుకుఉంటే, ఆసంఖ్యను ఈ ముఖ్యమంత్రి కేవలం 50లక్షలకే పరిమి తం చేశాడు. పింఛన్లు పొందేవారి సంఖ్యఏటేటా తగ్గిస్తున్న జగన్మోహన్ రెడ్డిహాయాంలో ఓటర్ల సంఖ్య మాత్రం రెండు, మూడురెట్లు పెరగడం విచిత్రంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏటా కొత్తగా నమోదయ్యే ఓటర్ల సంఖ్య 25లక్షలకు మించిందిలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో దాదాపు 60లక్షలమంది కొత్తఓటర్లు నమోదయ్యారు. ఇసుక, మద్యం అమ్మకాల ద్వారావచ్చే వేలకోట్లసొమ్ముని ఏరోజుకు ఆరోజుకి పోగేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, ఆసొమ్ము వినియోగించి, వచ్చేఎన్నికల్లో గెలవాలన్న ప్రణాళికలురచిస్తున్నాడు. ఆ సొమ్ముతో పాటు, దొంగఓటర్లను నమ్ముకుంటునే తానుఅనుకున్నది సాధ్యమని భావించి, అనర్హులనుకూడా ఓటర్లగా నమోదుచేసే ప్రక్రియకు శ్రీకారంచుట్టాడు.

టీడీపీహాయాంలో 60 ఏళ్లు పైబడినవారికి పింఛన్లు ఇచ్చి, అర్హులసంఖ్యను 55లక్షలకు చేర్చితే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ సంఖ్య 50లక్షలకు తగ్గడం విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో వృద్ధులమరణాల రేటు తక్కువగా ఉన్నప్పుడు పింఛన్ దారులసంఖ్య ఎందుకు పెరగడంలేదన్నదే తమప్రశ్న. ఒకటో తేదీవస్తే చాలు ఠంఛన్ గా పింఛన్లు అంటూ కోట్లాదిరూపాయల ఖర్చుతో ప్రకటనలు ఇస్తున్న ముఖ్యమంత్రి, ఆసొమ్ముని పింఛన్ల పెంపుకి ఎందుకు పెంచడంలేదని ప్రశ్నిస్తు న్నాం. పింఛన్లు ఇవ్వడమనేది కొత్తపథకమైనట్లు ఈ ముఖ్యమంత్రి తనవాలంటీర్లు, తన మీడియా సాయంతో దానిగురించి డబ్బాలుకొట్టుకుంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వాలు తొలినా ళ్లలలో రూ.25లు పింఛన్ ఇస్తే, దాన్ని రాజశేఖర్ రెడ్డి అధికారంలోకివచ్చాక రూ.75లు పెం చాడు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రూ.75లు పింఛన్ ను ఒకేసారి రూ.200లకు పెంచి, అనతికాలంలోనే దాన్ని రూ.2వేలకు తీసుకెళ్లాడు. ఆ విధంగా సామాజి క పింఛన్ల పెంపుని ఊహించనివిధంగా చేసి, అవ్వాతాతలకు కొండంతభరోసాఇచ్చాడు.

చంద్రబాబునాయుడి హాయాంలోనే రూ.200ల పింఛన్ రూ.2వేలు అయ్యింది. అలానే గత ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే రూ.3వేల పింఛన్ ఇస్తానని, ఒకఇంట్లో ఎందరు అర్హులు ఉంటే, అందరికీ ఇస్తానని కూడా చంద్రబాబుగారు చెప్పడం జరిగింది. కానీ అవ్వాతాతలు జగన్మోహన్ రెడ్డి తలనిమరుళ్లు, ఎంగిలిముద్దులకు మోసపోయి, మేఘాలను చూసి చేతిలో ని ముంతలో నీళ్లను ఒలకబోసుకున్నారు. అందుకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు లబోదిబో మంటున్నారు. పింఛన్ల పంపిణీ పేరుతో జగన్ తీసుకొచ్చిన వాలంటీర్లు 1వ తేదీన అవ్వా తాతల వద్దకువెళ్లి, పిచ్చిపిచ్చి మాటలచెబుతూ, పింఛన్ల పెంపు ప్రస్తావన రాకుండా ఫోటోలు తీసుకుంటూ పోజులిస్తున్నారు. 2022 లో రేపు 1వతేదీనుంచి ఇచ్చే పింఛన్ అయినా ఈ ముఖ్యమంత్రి రూ.3వేలు చేయాలని టీడీపీతరుపున డిమాండ్ చేస్తున్నాం. అలానే అవ్వా తాతలకు ఇచ్చే పింఛన్లలో అర్హులకు అన్యాయంచేయకుండా అందరికీ న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE