Suryaa.co.in

Andhra Pradesh

2020-21 ఆర్ధిక సంవత్సరం రాష్ట్రానికి ఒక తిరోగమన సంవత్సరం

-ప్రభుత్వం అన్ని రంగాలను దివాలా తీయించింది
-2021-22 కు సైతం ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక లేదు
-యనమల రామకృష్ణుడు

ఒక వేటగాడి చేతిలోని బాణం ఎంత ప్రమాకరమో…ఒక నియంతృత్వ పాలకుడి చేతిలో అధికారం కూడా అంతే ప్రమాదకరం. అటువంటి నియంత పాలకుడి పాలనలో ప్రజాస్వామ్యం, ప్రజలే బాధితులుగా ఉంటారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2021 లో అన్ని వ్యవస్థలను కుప్ప కూల్చి దివాలా తీయించాడు. 2022 ఆర్ధిక సంవత్సరానికి సైతం ఒక క్రమబద్దమైన పురోభివృద్ధికి ఆర్ధిక ప్రణాళిక ఉన్నట్లు కనిపించడం లేదు.

2021 ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి జగన్ పాలనకు మూడేళ్లు గడుస్తుంది. 2021 లో ఆర్ధిక వృద్ధిలో రాష్ట్రం నెగెటివ్ గ్రోత్ నమోదు చేసింది. ఇది ఎంతలా తిరోగమం చెందిందంటే అది సమీప భవిష్యత్తులో పూడ్చిలేనంతా నష్టం జరిగిపోయింది. రెవెన్యూ లోటు 918 శాతం కు, ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్) 388 శాతం పెరిగింది. రాకెట్ స్సీడ్ తో పరుగులు పెడుతున్న రెవెన్యూ లోటు ను ద్రవ్యలోటు అతి తొందరలోనే అధిగమించేట్లు ఉంది. మొత్తం బడ్జటరీ అప్పులు, బడ్జటేతర అప్పులు 445 శాతం, రెవెన్యూ రాబడులు 212 శాతం పెరిగాయి. కానీ, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా రెవెన్యూ రాబడులను మించి అప్పులు తెచ్చారు. తెచ్చిన అప్పులు కూడా ఆస్తుల కల్పన కోసం ఖర్చు చేయడం లేదు. ద్రవ్యోల్బణం కూడా అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతోంది. హోల్ సేల్ ధరల ఇండెక్స్ 14.5 శాతం, వినియోగదారుల ధరల ఇండెక్స్ 4.5 శాతం పెరిగింది.

వివిధ వర్గాలలో పేదరికం బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ పేదరిక సూచి 20 శాతం గా ఉంది. ఇది 2019 తెదేపా అధికారం కోల్పోయే నాటికి ఇది కేవలం 3.5 శాతం. అసమానతలు పెరిగిపోయాయి. సామాజిక, విద్య, ఆరోగ్య రంగాలలో 10 శాతం మేర తిరోగమన వృద్ధి నమోదయ్యింది.

ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. విభజన తర్వాత నష్టపోయిన నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఇది ఒక గొడ్డలిపెట్టు లాంటిది. విభజన హమీల అమలు కోసం చేసిన ప్రయత్నం శూన్యం. పోలవరం, ప్రత్యేకహోదా, అమరావతి రాజధాని లాంటి మొ.లగు పూర్తిగా పడకేశాయి. ప్రజాస్వామ్య నియంతృత్వం గుత్తాధిపత్యపాలనకు దారితీస్తుంది. అవినీతి పాలకుల పాలన పేద, మధ్యతరగతి ప్రజలను నిరు పేదలుగా, సంపన్నులను, కుబేరులుగా మారుస్తున్నారు. ఇది సామాజిక సమానత్వ సూత్రానికి చాలా ప్రమాదకరం.

LEAVE A RESPONSE