Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ వ్యాఖ్యలపై పార్టీలో అలజడి

-మాకు నమ్మకం లేదు జగన్‌
-కాడి వదిలేస్తున్న సొంత క్యాడర్‌
-నమ్మకం లేదంటున్న వైసీపీ శ్రేణులు
-కార్లపై స్టిక్కర్లను తొలగించుకుంటున్న వైనం
-విజయంపై ముందుకు రాని బెట్టింగ్‌ రాయుళ్లు
-సేమ్‌ కాన్ఫిడెన్స్‌ అంటూ కేఏ పాల్‌తో ట్రోలింగ్‌

ఐప్యాక్‌తో భేటీ తర్వాత సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై పెద్దఎత్తున ట్రోల్స్‌ వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలను సొంత క్యాడర్‌ నమ్మడం లేదు. 151 కంటే ఎక్కువ వస్తాయంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు అసహజంగా ఉన్నాయనే అభిప్రా యం వారిలో వ్యక్తమవుతోంది. పలుచోట్ల అభద్రతా భావంతో పార్టీ సానుభూతి పరులు, అభిమానులు కార్లపై ఉన్న మా నమ్మకం నువ్వే జగన్‌, సిద్ధం స్టిక్కర్లను తొలగించుకుంటున్నారు.

మరోవైపు పార్టీ కార్యకర్తలు ఇప్పుడే కాడి వదిలేయకుండా ఉండటానికే గెలుపుపై జగన్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని చర్చ కూడా సాగుతోంది. పోలీసు అధికారులను ఇంకా తమ అదుపులో ఉంచుకోవడానికి, తమ పోలింగ్‌ ఏజెంట్లు చివరి నిమిషం వరకు నిలబడడానికి, ప్రతిపక్ష పార్టీల క్యాడర్‌ను గందరగోళంలో పడేయడానికి మాట్లాడి ఉంటారన్న వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి.

ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలపై జగన్‌ వ్యాఖ్యల తరువాత బెట్టింగులు కట్టేందుకు కూడా వైసీపీ క్యాడర్‌ ముందుకు రావడం లేదు. పందేలు కాస్తే మునిగిపోతామన్న అభిప్రాయంలో ఉన్నారు. జగన్‌ వ్యాఖ్యలను సొంత పార్టీ వాళ్లే నమ్మలేదు అనడానికి ఇదే నిదర్శనమంటూ ప్రతిపక్షాలు విశ్లేషిస్తున్నాయి. అన్ని ఓట్లూ నాకే అంటూ కేఏ పాల్‌ చేసిన వీడియోలు, జగన్‌ వ్యాఖ్యల వీడియోలు కలిపి సేమ్‌ కాన్ఫిడెన్స్‌ అంటూ ట్రోలింగ్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కూటమిదే అధికారం అనే విషయంలో బెట్టింగ్‌ రాయుళ్లు దూకు డుగా ముందుకు వస్తున్నారు.

LEAVE A RESPONSE