మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి రాష్ట్ర పోలీసు వ్యవస్థ బయటపడాలి

– ప్రశ్నించే గొంతును ఎందుకు నొక్కుతున్నారు?
– దళితుల హత్య అంటే అంత తేలిగ్గా తీసుకోవద్దు
-టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

రాష్ట్ర పోలీసు వ్యవస్థ మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి బయటపడాలని పోలీసు వ్యవస్థని కోరుతున్నాను. ప్రశ్నించే గొంతును ఎందుకు నొక్కుతున్నారు? సవాంగ్ మార్క్ పోలీసింగ్.. ఆయన చేసింది కరెక్టు పోలీసింగ్ కాదు. ఆయన డీజీపీగా ఉన్నప్పుడు పోలీసింగ్ అది చట్టబద్దమైన పోలీసింగ్ కాదని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాధరెడ్డికి విన్నవిస్తున్నాను. సవాంగ్ మార్క్ పోలీసింగ్ లేదు అని ప్రజంట్ డీజీపీ చెప్పాలి.

తూర్పు గోదావరి నుంచి సుబ్రమణ్యం అనే మరో దళితుడు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ చేతిలో బలైపోయాడు. అసలు సిసలైన కారణాన్ని అన్వేషించాలి.
ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ విషయంలో పోలీసులు వేసిన అడుగలన్నీ తప్పటడుగులే. ఎక్కడ కూడా సరైన అడుగు పడలేదు. ఎందుకు తప్పటడగులు వేయాల్సి వచ్చిందో చెప్పాలి. ఎవర్ని రక్షించడానికి తప్పటడుగులు వేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో నడుస్తున్నారని తెలుస్తోంది. ఎవరి కోసం ఈ మౌనం? ఎవరి కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు? శవాన్ని అక్కడ పెట్టి వెళ్తే ఆ శవం ఎక్కడి నుంచి తెచ్చావ్? అని పోలీసులు అడగాల్సివుంది.

పోలీసులు ఉదయ్ భాస్కర్ గన్ మెన్ లతో మాట్లాడలేదు. ఎస్పీ, డీఎస్పీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో, సబ్ ఇన్స్ పెక్టరో ఎవరో ఒకరు శవాన్ని తెచ్చినవారితో మాట్లాడాలి. పోలీసు వ్యవస్థ ఈ అపవాదును ఎందుకు మోస్తోందని నేను ప్రశ్నిస్తున్నాను. నేరస్థుల్ని రెండు గుద్దాలి, బేడీలు వేసి రిమాండుకు పంపాలి. ఎమ్మెల్సీని నిలదీయాలి. ఎమ్మెల్సీకున్న గన్ మెన్ లని విచారించరా? గన్ మెన్ కు ఫోన్ చేస్తే చెబుతాడుకదా? మీ ప్రతిష్టని ఎందుకు పణంగా పెడుతున్నారు? బాధాతప్త హృదయంతో ప్రశ్నిస్తున్నాను.

పోలీసు వ్యవస్థను ఎగతాళి చేయాలని నాకు లేదు. సుబ్రమణ్యం శవానికి పోస్టుమార్టం చేసి సమాధి చేయాలనే తపన తప్పితే ఏం జరిగిందో తెలుసుకోవాలన్న తాపత్రయం పోలీసు వ్యవస్థలో ఎందుకు కనపడలేదు. దర్యాప్తు చేసి వస్తవాలు గ్రహించడంలో పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయింది. నిజానిజాలు రాబట్టాలనే ఆలోచన ఎందుకు చేయలేదు. పోలీసు వ్యవస్థో, సజ్జల రామకృష్ణారెడ్డో సమాధానం చెప్పాలి. ఇందులో పెద్ద కుట్ర దాగివుంది. లోతుగా దర్యా్ప్తు చేయాల్సివుంది. ఎమ్మెల్సీ కుటుంబసభ్యులందరినీ పరీక్షించి దర్యాప్తు చేయాల్సివుంది. ఎమ్మెల్సీ ఘన చరిత్ర గలవాడంటున్నారు. ఆయన ఘనచరిత్రను వెలికితీయాల్సిన అవసరముంది. అతని ఘనచరిత్ర చనిపోయిన సుబ్రమణ్యంకు తెలుసు అంటున్నారు. ఆయన ఘనచరిత్ర వెలికితీయకుండా, ఎలా చనిపోయాడో తెలుసుకకుండా ఎమ్మెల్సీని రక్షించడం కోసం పడే తాపత్రం చాలా ఆక్షేపణీయంగా ఉంది.

మృతుడి కుటుంబీకులతో టీడీపీ నాయకులు మాట్లాడితే అభ్యంతరమేంటి? పోలీసు శాఖ దాగుడు మూతలాడుతోంది. ఇలాంటివి జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ నిజాన్ని దాచిపెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? సజ్జల షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఒక కొత్త ఎస్ఐకి ఈ కేసు ఇచ్చినా దర్యాప్తు చేయగలడు. అటువంటిది నానబెడుతున్నారు. ఎమ్మెల్సీని లాక్కొచ్చి కూర్చోబెట్టేవాడు. అపప్రద తప్పితే ఏం సాధించారు? గతంలో సవాంగ్ ఆర్టికల్ 19ని భారత రాజ్యాంగం ను ఏపీలో లేకుండా చేశారు. మీరు కూడా అలాగే చేస్తారా? అని కొత్త డీజీపీని ప్రశ్నిస్తున్నాను.

ఏం తప్పు చేశాడని దళిత నిజనిర్దారణ కమిటి సభ్యుడు ఎంఎస్ రాజుని డీఎస్పీ కొట్టారు? ఆ డిఎస్పీపై చర్యలు తీసుకోరా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం జరిగిందో తెలుసుకునే స్వేచ్ఛ ఉంది. నిరంకుశ పరిపాలన కాదు. సవాంగ్ నడిచిన బాటలో నడిస్తే అపప్రద మూటగట్టుకుంటారు. తాత్కాలిక మెప్పు కోసం డీజీపీ మీ ఇమేజ్ ని దిగజార్చుకోకండి. ఏమిలీ నిరంకుశత్వం, పోలీసు వ్యవస్థ ఉందా? లేదా? మామూలు కేసు కాదు. అనంత ఉదయభాస్కర్ గుట్టు రట్టు చేస్తాడనే ఉదయ భాస్కర్ అతన్ని చంపినట్లా? సంబంధిత పోలీసు అధికారులు దర్యాప్తు చేయాలి. 174 ఎఫ్ఐఆర్ ను ఎస్ఐ ఎలా నమోదు చేస్తారు?

సుబ్రమణ్యం మరణానికి అసలు సిసలైన కారణాలను బయటికి తీయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. సుబ్రమణ్యం పోస్టుమార్టం వీడియోగ్రఫీ తీశారా లేదా? రెవెన్యూ అధికారుల సమక్షంలో జరిగిందా? లేదా? నిపుణులైన డాక్టర్ ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగిందా? లేదా? లేకుంటే ఆషా మాషీగా చేయించారా? సమాధానం చెప్పాల్సిన అవసరముంది. కుట్ర వెలికితీయాలి, అనంత ఉదయ డ్రైవర్ సుబ్రమణ్యం ఎవరెవరిని ఎక్కడ ఎక్కడ దించాడో బయట పడుతుందని మట్టుబెట్టారా? అనేది తేలాలి. ఈ కేసును చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇది అంతం కాదు, ఆరంభం. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవాలి. ఎంక్వైరీ చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు.

 

Leave a Reply