Suryaa.co.in

Andhra Pradesh Entertainment Telangana

ఖమ్మంలో 40 అడుగుల ఎన్టీఆర్‌ భారీ విగ్రహం

– మంత్రి పువ్వాడ అజయ్ కృషితో లకారంలో ఏర్పాటుకు సన్నాహాలు
– రూ.3 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా విగ్రహం తయారు

ఖమ్మం నగరంలోని లకారం చెరువు తీగల వంతెన మధ్య భాగంలో పూర్వ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కృష్ణావతార విగ్రహం ఆవిష్కృతం కానుంది. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృషితో ఎన్టీఆర్‌ అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 40 అడుగుల విగ్రహాన్ని రూ.3 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. లకారం చెరువు మధ్యలో తీగల వంతెన వద్ద ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ విగ్రహాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే విగ్రహం ఏర్పాటు పనులు తుదిదశకు చేరుకున్నాయి.

LEAVE A RESPONSE