Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరక్షరాస్యులుగా ఉండకూడదన్నదే సీఎం లక్ష్యం

– జాబ్ మేళాకు మంచి స్పందన
– మెగా జాబ్ మేళాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి

ప్రొద్దుటూరు : జాబ్‌ మేళాకు విచ్చేసిన వివిధ కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు, ఉద్యోగాలను ఆశించి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్య అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. మనం జీవించడానికి ఆహారం ఎంత అవసరమో విద్యా, వైద్యం కూడా అలాంటిదే. మనిషి జీవితంలో ఈ మూడింటికి సమోన్నత ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలో ఎవరూ నిరక్షరాస్యులుగా ఉండకూడదనేది ముఖ్యమంత్రి అభిమతం, ఆశయం. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువుకోవాలి, ముఖ్యంగా విద్యార్థినులు కూడా గొప్పగా చదువుకుని ఉన్నత పదవులకు వెళ్లాలి. మహిళా సాధికారత వైయస్సార్‌ సీపీ ఆశయం, ముఖ్యమంత్రి కల. అది తప్పకుండా నెరవేరుతోంది. అందుకే నాడు-నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆహ్లాదకర వాతావరణం ఉండేవిధంగా తీర్చిదిద్ది విద్యా ప్రమాణాలు పెంచుకోవడం జరుగుతోంది.

విద్యతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిని ఇంప్రూవ్‌ చేసుకోవాలి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం అంతా ఒకటే. ఎక్కడకు వెళ్లాలన్నా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చూస్తారు. మనసులో ఉన్న ఆలోచనలను ఎదుట వ్యక్తికి ఎంత ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్‌ చేస్తామో.. దాన్నిబట్టే ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశాలు ఉంటాయి.

వైఎస్ఆర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు. అదేవిధంగా గల్ఫ్ లో ఎలా అయితే ఉపాధి పొందుతున్నారో భవిష్యత్‌లో అమెరికాలో గానీ ఆస్ట్రేలియాలో గానీ జర్మనీ, జపాన్‌, యూరప్‌లో గానీ ఉద్యోగ అవకాశాలు సంపాదించుకునే స్కిల్స్‌ పొందాలి. ముఖ్యమంత్రి ఆదేశాలు, ఆశయాలు మేరకు రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా ఉండకూడదని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృక్పధంతో ప్రయివేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నాం. జాబ్‌ మేళా అనేది నిరంతర ప్రక్రియ. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.

ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ… వైయస్ఆర్సీపీ నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళాలు నిర్వహించడం చాలా శుభ పరిణామం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మూడు జాబ్‌ మేళాల్లో 40వేలమందికిపైగా ఉపాధి అవకాశాలు లభించాయి. నాలుగో జాబ్‌మేళాను వైయస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని సీబీఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్నాం. ఈ మేళాలో 100కు పైచిలుకు కంపెనీలు పాల్గొన్నాయి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా విచ్చేసిన అభ్యర్థులందరికీ అభినందనలు.

LEAVE A RESPONSE