Suryaa.co.in

Entertainment

పుష్పలో నటించే గోల్డెన్ చాన్స్ మీదే కావొచ్చు…

అల్లు అర్జున్ కెరీర్ లో తిరుగులేని హిట్ గా నిలిచిపోయే చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. పుష్ప ది రూల్ పేరిట వస్తున్న ఈ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆడిషన్స్ ప్రకటించింది. వయసుతో సంబంధం లేకుండా మేల్, ఫిమేల్, చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. తిరుపతిలో జులై 3, 4, 5 తేదీల్లో నటీనటులకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్టు తెలిపింది.

తిరుపతి నగరంలోని మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ (న్యూ బాలాజీ కాలనీ) వేదికగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వకు ఆడిషన్స్ ఉంటాయని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. అయితే, ఆడిషన్స్ కు వచ్చేవారికి ఓ షరతు విధించింది. చిత్తూరు యాస తప్పనిసరి అని స్పష్టం చేసింది.

LEAVE A RESPONSE