మధురగీతాల శాల పెండ్యాల!

ఘంటసాల నిష్ట..
సినీ సంగీతానికి పరాకాష్ట
శివశంకరీ శివానందలహరీ..
రసికరాజ
తగువారము కామా
తెలుగు పాట అభిమానుల హృదయాల్లో
శాశ్వతంగా తిష్ట
పెండ్యాల ప్రతిష్ట!

విజయా వారి జెండా ఎగిరితే
పెండ్యాల సంగీత ప్రవాహం
వీనుల విందుగా సాగితే
అది జగదేకవీరుని కథ..
మధుర గీతాల సుధ..!

ఈ నాగేశ్వరుడి
సినీ సంగీత ప్రస్థానంలో
అన్నీ మంచి శకునములే..
సాలూరు వారి శిష్యరికంలో
సినీ సంగీత పనిముట్లు.. గుట్టుమట్లు ఎరిగి
అటుపై నాక్కూడా
మ్యూజిక్ డైరక్షన్
తెలిసిందిలే..
తెలిసిందిలే
అంటూ ఎన్ని హిట్లు..
అలరించే ఎన్నెన్ని డ్యూయెట్లు
పరాకాష్టగా దుర్యోధనుడికీ
చిత్రం భళారే విచిత్రం
అంటూ ఓ డ్యూయెట్టు..
అది మరీ హిట్టు!

అలిగిన చెలి గడియ బిగిస్తే
అలుక మానవే
చిలుకల కొలికిలో
తలుపు తీయవే
ప్రాణసఖీ..
ముద్దుగా మాస్టారి గళం..
తెరుచుకున్న సత్యభామ మందిర తాళం..
పెండ్యాల సుమధుర
సంగీత సమ్మేళం!

ఘంటసాల అంటే
వల్లమాలిన అభిమానం..
ఆ ఇద్దరి జతలో
తెలుగు జాతికి
ఎన్నో గొప్ప పాటల బహుమానం..
శివశంకరీ కొలమానం..
రసికరాజ నిరుపమానం!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply