అది ఆరుద్ర ముద్ర..

త్వమేవాహం..
ఓ సాహితీ ప్రవాహం..
మహాకవి శ్రీశ్రీ
మెచ్చి దాసోహం..
ఆరుద్రకే చెల్లిన ఆరోహం!

గేయమైనా..సినీ గీతమైనా
ప్రతి పదంలో తన ముద్ర..
ఔను..ఇది రాసింది ఆరుద్ర…
అది ఆయన శైలి..
అందుకే అయ్యాడు సినీవాలి!

కూనలమ్మ పదాలు
పలికితే మురిసిపోవా పెదాలు..
రహదారి బంగళా..
ఆరుద్ర మార్కు
సాహితీ మేళా!

బీదలపాట్లుతో మొదలైన సినీప్రస్థానం..
పేదరికమే చూపింది
చాలా కాలం..
కొళాయి నీరు త్రాగి
అక్షరాల పంపు విప్పితే
వేదంలా ఘోషించె గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి.._
అంతకు ముందే
కొండగాలి తిరిగింది
గుండె ఊడులాడింది
గోదావరి వరద లాగ
కోరిక చెలరేగింది..
సినిమా పాట
దశే మారింది..!

పొడుగాటి లాల్చీ..
అంతకంటే పొడుగైన గెడ్డం..
తెల్లటి పైజమా..
భుజాన సంచి..
అతడేగా మధురగీతాల విరించి..
తానుగా హేతువాది..
అయినా ఆ కలంలో
ఇందీవర శ్యాముడు
అందువలన దేముడు
అయ్యాడు దాశరథి..!

బాలభారతంలో రాసే
అవకాశం వస్తే
ఆకాశానికి నిచ్చెనలేసి
ఎక్కిన భీముడు
మానవుడే మహనీయుడై
శక్తియుతుడు యుక్తిపరుడై
మాననీయుడూ అయ్యాడు అరుద్ర పెన్నుతొ..
రాయినైనా కాకపోతిని
రామపాదము సోకగా
అంటూ వాణిశ్రీ
నీటిని..నిప్పును
కురిపించింది చెరో కన్నుతో!

కవీ..కవికి వలదయ్య
ఈ కాగితము..
అంటూ ప్రత్యక్షంగా
పొట్టి ప్రసాదుకి చురకలేసి
మల్లెపూవులో
ఠావుల కొద్ది మాటలు
టన్నుల కొద్ది పాటలు రాసిన భాగవతుల శివశంకర శాస్త్రి
బహు కావ్యసౌధాల
అక్షర మేస్త్రి!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply