Suryaa.co.in

Entertainment

హిందీ సినిమాల్లో రాహుల్ చల్..!

పియతూ అప్తో ఆజా..
దమ్మరో దమ్..
మెహబూబా..మెహబూబా..
ఇవి బ్యాండ్ బాజా..

ఏ షామ్ మస్తానీ..
చురాలియాహై తుమ్నే
జో దిల్ హై..
క్యా హువా తేరీ వాదా..
ఇవి మెలోడీ

మేరే సప్పనొంకి రాణి
కబ్ ఆయెగీతు..
యాదోంకి బారాత్ నిక్లీ
హే యార్ దిల్ కీ ద్వారే..
సంగామారే..
ఇవి ఆల్ టైం హిట్స్..

ఉర్రూతలూగించే
డ్రమ్ముల మోతలు..
కట్టి పడేసే అద్భుత స్వరాలు
మనసు దోచేసే ప్రేమ గీతాలు
గతంలోకి తీసుకుపోయే
ఆహ్లాద రాగాలు..
ఎవరికి ఏది కావాలంటే అది
స్వరాల మూటలు విప్పి
రాగాల మాలలు కట్టి..
వాయిద్యాల నైవేద్యం పెట్టే
పాటల మాంత్రికుడు
రాహుల్ దేవ్..బర్మన్..
సచిన్ దేవ్
స్వరాల వారసుడు..
ఆయన మధుర గీతాల కోరసుడు..
331 హిందీ సినిమాల
నవరసుడు..!

రఫీ తీయని గొంతు..
కిశోర్ పాటలతోనే గెంతు..
ఇవన్నీ రాహుల్ దేవ్ వంతు..
పాడేందుకు అలసిపోని గాయకులు..
స్వరాల అక్షయుల్లా
బర్మనుడు..
బాదుడే బాదుడు..
అద్భుత గీతాల కోవిదుడు..!

నాన్న సచిన్ తొలి గురువు
చిన్నప్పుడే నేర్చిన దరువు..
సంగీతమే బ్రతుకుతెరువు..
వందల కొద్దీ హిట్టు పాటలే
సాధించుకున్న పరువు..

రాజేష్ ఖన్నా..కిశోర్..
రాహుల్ దేవ్..
ఈ సమ్మేళనం..
పాటల సమ్మోహనం..!
ప్యార్ దివానా హోతాహై
మస్తానా హోతా హై..
ఏ షాం మస్తానీ..
కటీపతంగ్..
అద్భుత గీతాల తరంగ్..!

మోనికా ఓ మై డార్లింగ్..
అదరగొట్టేసిన హమ్మింగ్..
హరేరామ హరేకృష్ణ…
జీనత్ అమన్ దశ మార్చేసిన
దమ్మరో దమ్..
సినిమాని పాట మింగేయకుండా కోత పెట్టిన దేవానంద్..
ఏ దోస్తీ హమ్ నహీ చోడెంగే..
తోడెంగే దమ్ మగర్..
తేరే సాద్ నా చోడెంగే..
షోలే..ఈ పాటే ఊపేసిందిలే..!

విడిపోతే విడిపోయారు గాని
ఆశా..బర్మన్..
పాటల కాపురం..
స్వరాల గోపురం..
సంగమమే శ్రుతి..
సమాగమమే లయ…
ఆ జంట
మహామహాగీతాల హిమాలయ..
లతాజీ పెద్ద దిక్కుగా
విరాజిల్లిన స్వరాలయ..!
ఆర్డి బర్మన్ పుట్టినరోజు

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE