పదివేల పాటల మూటలు!

రావోయి చందమామా
మా వింత గాథ వినుమా..
చూడుమదే చెలియా
కనులా చూడుమదే చెలియా..
నారీ నారీ నడుమ మురారి..
హరికి హరికి
నడుమ వయారి..
ఇలాంటి ఓ పదివేల పాటలు
శ్రోతలకు వరాల మూటలు..
తేట తెనుగు ఊటలు..!

తెలుగు సినిమా
ఘంటసాల పాటల మత్తులో పరవశిస్తున్న వేళ..
గంభీరమైన ఆ స్వరం నుంచి
ఓ మార్పు..
మెలోడీ..శ్రావ్యతల కూర్పు..
ఇట్టే ఆకట్టుకునే నేర్పు..
ఎఎం రాజా..
మాస్టారి పాటల
వాడుక మరచెదవేల
అంటూ జనాలకి
వేడుక చేసిన వేళ..
చూడుమదే చెలియా అనగానే
మురిసి జిక్కి
పెళ్లి పల్లకి ఎక్కి
అయింది శ్రీమతి రాజా..
మోగుతుంటే పెళ్లి బాజా!
పాటకు పాట జత కలిసి
సిరిమల్లె సొగసు..
జాబిల్లి వెలుగు..
ఆ ఇద్దరిలో చూసి..
సినిమా మరింతగా మురిసి!

సుందరాంగులను
చూసిన వేళ
కొందరు ముచ్చట పడనేల..
కొందరు పిచ్చను పడనేల..
ఈ పాటలో ఘంటసాలతో
గొంతు కలిపి..
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
ముందుగ ఎవరిని వరించునోయని మది కలవరపడుటే అరుదు కదా..
ఆ గొంతులో
అదోలాంటి మత్తు..గమ్మత్తు..
భానుమతి కూడా అందుకే అడిగిందేమో..
ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధనా..అని
అదో మధురగీతాల గని…
ఎప్పటికీ మరచిపోదు అవని!
నేడు ఎ.ఎం.రాజా పుట్టినరోజు

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply