పేకాట ఆడుతూ పట్టుబడిన హీరో బాలయ్య పీఏ

– కర్ణాటక గౌరిబిదనూరులో కేసు

ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ పీఏగా ఉన్న బాలాజీతో పాటు మరి కొందరు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. కర్ణాటకలోని గౌరిబిదనూరు పోలీస్ స్టేషన్లో పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదయింది. బాలాజీతో పాటు మరో పన్నెండు మంది ఉపాధ్యాయులు, పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి ఒక లక్ష యాభై వేలు నగదును గౌరిబిదనూరు పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Leave a Reply