Suryaa.co.in

Entertainment

నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ని..ఎలా చెబితే అలా చేస్తా: బాలకృష్ణ.

అఖండ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు హీరో బాలకృష్ణ. కృతజ్ఞతలు తెలిపారు.ఇది చలనచిత్ర పరిశ్రమ విజయని పేర్కొన్నారు. అఖండ సక్సెస్ మీట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బాలయ్య.
నందమూరి నటసింహం బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ అభిమానులకు ఫుల్మీల్స్ పెట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా హిట్ టాక్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ.. ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. “ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చిత్రానికి ఇంత అఖండ విజయం అందించిన ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు. కొత్తదనాన్ని తెలుగు వారు ఆదరిస్తారు అనడానికి ఉదాహరణ ఈ అఖండ. ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం. తమన్ మంచి బాణీలు సమకూర్చారు. మా సినిమాలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడ్డారు. సినిమానే మా ధ్యేయం. నేను ఓ డైరెక్టర్ ఆర్టిస్ట్ని.. కాబట్టి డైరెక్టర్ ఎలా చెబితా అలా నడుచుకుంటాను.” అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

LEAVE A RESPONSE