భారత్లో ‘ఒమిక్రాన్’ కేసులపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

భారత్లో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించడంపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ఒమిక్రాన్లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, అందులో కొన్ని ఆందోళనకరంగా ఉన్నట్లు హెచ్చరించింది.
భారత్లో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతంలో గుర్తించిన తొలి రెండు కేసులు ఇవేనని స్పష్టం చేసింది.
ఒమిక్రాన్లో చాలా మ్యుటెషన్లు ఉన్నాయని, అందులో కొన్ని ఆందోళనకరంగా ఉన్నట్లు హెచ్చరించింది. “భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతంలో తొలి రెండు కేసులు ఇవే. దేశాలు అనుసంధానమైన ప్రస్తుత పరిస్థితుల్లో కేసులు రావటం పెద్ద విషయం కాదు. ఒమిక్రాన్ వేరియంట్లో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నాయి.
అందులో కొన్ని ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ సంక్రమణ, రోగనిరోధక శక్తిని ఎదుర్కొనే సామర్థ్యం వంటి ఇతర అంశాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్లను త్వరగా గుర్తించి ప్రపంచానికి తెలియజేసే దేశాలను డబ్ల్యూహెచ్ఓ ప్రశంసిస్తుంది.” అని డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్, డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ అన్నారు.