ఔను..అతడు నూటొక్క జిల్లాల అందగాడే

నిన్నా మొన్నటి
నూటొక్క జిల్లాల అందగాడు..
బాపూ గీసిన ముత్యాలముగ్గులో
నిత్యపెళ్లికొడుకు..
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో
ఉన్నప్పుడు నిష్క్రమించిన
హాస్య,క్యారెక్టర్,విలన్..
మన విలక్షణ నూతన్…!

ఎన్ని పాత్రలు వేశాడో..
ఎంత వెరైటీ చూపాడో…
తారు డబ్బాలో మించి తీసిన కాకిపిల్లలా ఉన్నాడు..
వీడు నీ కొడుకేంట్రా..
అలాంటి డైలాగులు
పలికేటప్పుడు ఆ విరుపు..
చూసే ఆ చూపు..
అదో కైపు..మరో టైపు..
నూతన్ ప్రసాద్ అలాగే లేపేసాడు టాపు..!

పెళ్లి మీద పెళ్లి..
రావుగోపాలరావు
వెటకారం..
ఓ వైపు సంబరం..
మరో వైపు భారం..
బాపూ పుట్టించిన
రెండు పాత్రలు..
ఎలాంటి బాధనైనా
ఒక్క సీనుతో పోగొట్టే
కామెడీ మాత్రలు..!

చలిచీమలు సినిమాలో
ఒక్క ఫోను సీను…
ఎన్ని రివార్డులో..
ఎన్నెన్ని గ్రామ్ ఫోను రికార్డులో..
నంది అవార్డులో..
అతడే పోలీసు..
అతడే దొంగ..
మెగాస్టార్ కంటే ముందే
రిక్షావోడై పాడేశాడు
ఇంటింటి రామాయణం..
అప్పుడే కామెడీ..
అంతలోనే ట్రాజెడీ..
బామ్మ మాటతో..
చక్రాల కుర్చీ బాట..
పెను విషాదమైనా
నటనపై మక్కువ తీరక..
భరించలేక అలాంటి తీరిక
వరప్రసాదు అయ్యాడు మరింత నూతనం..!

రాజాధిరాజులో సాతాను
నూతన్ నటజీవితంలో
ఓ తుపాను..
అంతటి నూటొక్క జిల్లాల అందగాడూ..అలాంటి విలక్షణ నటుడూ
విషాదం ప్రమాదం రూపంలో
కాటు వేసినా
ఆగిపోని యాక్టరై..
కొనసాగించి నట తపస్సు..
మూటకట్టుకున్నాడు
మరింత యసస్సు..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply