హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోన్న నేపథ్యంలో దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు, వేడుకల నిర్వహణ, సినిమా థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.
ఇదిలా ఉంటే మరి కొన్నినెలల్లో జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. ఒమిక్రాన్ విస్తరిస్తోన్న వేళ రాజకీయ పార్టీలు సభలు ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్‌పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ స్పందించారు.
వివాహాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, థియేటర్లు.. ఇలా ప్రతి చోటా ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం పొలిటికల్ ర్యాలీలపై మాత్రం ఎందుకు పెట్టలేదు?’’ అని ప్రశ్నించారు. ‘‘నా జీవితంలో అతిపెద్ద అనుమానం ఏమిటంటే.. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ నిర్వహించే రాత్రి కర్ఫ్యూ కారణంగా ఉద్ధృతంగా విస్తరిస్తోన్న వైరస్ ఏ విధంగా తగ్గుముఖం పడుతుందో తెలియడం లేదు’’ అంటూ ఆర్జీవీ తన అనుమానాన్ని బయటపెట్టారు.