Suryaa.co.in

Entertainment

వెండి తెరపై విలన్..నిజ జీవితంలో హీరో

వెండి తెరపై విలన్..
నిజ జీవితంలో హీరో..
మానవత్వానికి
బ్రాండ్ అంబాసిడర్..
శిబి..బలి..కర్ణ..
ఈ పాత్రలకు
ప్యాంటు షర్టు రూపం
ఆ ముగ్గురి ప్రతిరూపం..
దాతృత్వంలో
బాలీవుడ్ బ్లాక్ బస్టర్..
మోంగ్ లో పుట్టిన మొనగాడు
ఈ రోజున
భారతీయతకే చిరునామా..
సోనూ సూద్..
ఇప్పుడు ఇంటింటి సబ్జెక్ట్…
మిస్టర్ పెర్ఫెక్ట్..!

అతడులో ముద్దుగుమ్మడు
నందూకి దెబ్బకొడితే
పోకిరోడు మల్లిగాడని తిట్టుకున్న జనం…
అరుంధతిలో
వదల బొమ్మాళీ
అన్న పశుపతిని చూసి
వణికిపోయారు..
జులాయిలో బాంక్ దోచేస్తే
ఇంత మాయగాడా బిట్టూ అని ముక్కున వేలేసుకున్నారు..
దూకుడులో పేరు నాయక్
అయినా ఇక ఎప్పటికీ
ఖల్నాయకేనని
ముద్ర వేసేసారు..
అలాంటి ఓ ఆలోచన..
మార్చేసింది అతడి వివేచన..
కరోనా తొలి వేవ్ రోజుల్లో
వలస కూలీలను ఆదుకున్న
సోనూసూదులో
సోన్యూసూద్ సాక్షాత్కారం..
సర్వం సమర్పయామి అన్నది
ఆ మనిషిలోని సంస్కారం..
భరత జాతి మొత్తం తలవంచి చేసింది
అతడికి నమస్కారం..!

ఉన్ననాడు తెలివిగలిగి పొదుపు చేయరా..
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా..
ఈ రెంటినీ
తూ.చ తప్పకుండా
పాటించిన సోనూ..
అంతకు మించి ఎదిగి
పొదుపు చేసిందీ..
కూడబెట్టినదీ చాలక
అప్పు చేసి జనాలకు పప్పుకూడు పెట్టి
ఎండనక వాననక
కాళ్లరిగేలా చెప్పులు తెగేలా నడుస్తున్న బడుగుజీవులను
బస్సుల్లో..విమానాల్లో..
స్వస్థలాలకు చేర్చి
ఆధునిక భారతంలో
కొంగొత్త చరిత్రలో
సరికొత్త మెస్సయ్యగా
అవ”తరించి”..
పెద్ద స్టార్లు సైతం తన వెనక మిస్సయ్యేలా ఎదిగాడు..
జనం గుండెల్లో ఒదిగాడు..!

విలనై గడించాడు..
హీరో అయి పంచాడు..
మనిషి విలువ పెంచాడు…
సోనూసూద్..జిందాబాద్..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE