Suryaa.co.in

Entertainment

నటనే నఖశిఖం..బహుముఖం!

మహాగ్రంధమైనా చాలని
నటశిఖరాన్ని
ఒక్క కవితలో దాచడమా..
కోపమే రూపమై..
ఆంగికమే మమేకమై..
వాచకమే ప్రత్యేకమై..
అభినయమే తానై..
బాలీవుడ్ ని ఏలే బాద్ షా
భారతీయ సినిమా సెహెన్షా!

అమితాబ్ బచ్చన్…
ఆ పేరే ఓ వైబ్రేషన్..
మనిషే సెన్సేషన్…
సాత్ హిందుస్తానీ లో
ఏడుగురిలో తానొకడై..
జంజీర్ లో తానే ఒక్కడై..
దీవార్ తో ఒకే ఒక్కడై..
దాటేసినా ఎనభై..
చెప్పలేదు గుడ్ బై..
కుమ్మేస్తున్నాడు ముంబై..!

ఆయన నవ్వితే
జనం నవ్వారు..
గెంతితే తామూ గెంతారు..
ఏడిస్తే ఏడ్చారు..
కోపాన్నీ ఆస్వాదించారు..
ఎవరికైనా కోపమే శత్రువు..
అమితాబ్ కోపం మాత్రం
సక్సెస్ సూత్రం..!

ముప్పై ఏళ్ల ఇండస్ట్రీ కాదండోయ్..
ఆయనే ఒక ఇండస్ట్రీ..
నాలుగు దశాబ్దాల పాటు
పరిశ్రమను మోసిన మేస్త్రీ..!

ఆరడుగుల విగ్రహం..
చెక్కుచెదరని నిగ్రహం..
బాలీవుడ్ సినిమా సంగ్రహం
ఆ గళం విప్పితే గందరగోళమే..
నాణెం ఎగరేస్తే
వీరు ధర్మేంద్రకు మాయాజాలమే..
రెండు చేతులూ
ముందు పెట్టి
చిత్రంగా నడుం ఊపితే
ఉర్రూతలే…
మేరా పాస్ కార్ హై..
బంగాళా హై..
బ్యాంక్ బ్యాలెన్స్ హై..
తేరా పాస్ క్యా హై..
అలా గుండె గాయమై
శశిని అడిగితే
అతగాడికి భయమే..
గుడికెళ్ళి దేవున్నే ప్రశ్నిస్తే
థియేటర్లలో నిశ్శబ్దమే..
మొత్తానికి ఏం చేసినా నిబద్ధమే..సంబద్దమే..!

కూలి లో గాయమై
ఆస్పత్రిలో చేరితే
అది దేశానికే విపత్తా..
అన్నట్టు ఆక్రోశించిన జనం..
ఇంటి మనిషికే ప్రమాదం
అయినట్టు విషాదం..
కోలుకుంటే జాతికి పండగ..
మహమ్మారి కూడా
ఆయన ముంగిట గాలిబుడగ…
బచ్చన్ జల్సా
ఎప్పటికీ కులాసా..!

గుడ్డీ తో పరిణయం..
బాధురాయణంలో రేఖా మాత్రంగా
ప్రేమాయణం..
ముక్కోణపు సిల్ సిలా..
మధ్యలో ఆర్థికంగా తిరోగమనం…
కౌన్ బనేగాతో కరోర్పతితో
ఆయనయ్యాడు కరోర్పతి..
ప్రాణం నిలిపింది నానావతి..
అభీ భీ నటిస్తూనే ఉన్నాడు
మన బిగ్ బి..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE