సినిమా సిరి దాసరి..!

సినిమాకి దర్శకుడే కెప్టెన్..
ఇదే నినాదం..
అదే విధానంతో
తెరను ఏలిన వేలుపు..
చిత్ర పరి”శ్రమ”కు మేలుకొలుపు..
నిర్మాతలకు కొంగు బంగారం
దర్శకరత్న మేధస్సే బాక్సాఫీస్ భాండాగారం..

స్వర్గం నరకంతో మొదలైన విజయ ప్రస్థానం..
తాతా మనవడుతో ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం..
ఆయనే కథ..మాటలు..
పాటలు..స్క్రీన్ ప్లే..
నిర్మాత..దర్శకుడు
అపుడపుడు నాయకుడు..
ఇన్ని చేసిన కళాకారుడు
ప్రపంచ సినీ చరిత్రలో
ఒక్కడే..దాసరి..
ఆయనకు కారెవరూ సరి..
దేనికదే వైవిధ్యం..
మరెవరికీ కానే కాదు సాధ్యం!

సినిమాకి మూలం దర్శకుడు
తెరపై హీరో
నటసామ్రాట్ అక్కినేని అయినా..
నటరత్న నందమూరైనా
దర్శకరత్న మాటే ఫైనల్..
ఓ ప్రత్యేక కుర్చీ..
పైన ఓ గొడుగు..
ఆయన కళ్ళకు నల్లద్దాలు
తలపై తెల్లని టోపీ..
ప్రతి సినిమాకి ప్రజల ప్రశంసలే
అతి పెద్ద ట్రోఫీ..

హీరో ఎవరైనా కథా బలం..
దాసరి ఆత్మబలం..
ఆయనలోని దర్శకుడి జాలం..
అక్కినేనికి ప్రేమాభిషేకం జరిపితే..
ఎన్టీఆర్ ని చేసింది
బొబ్బిలి పులి..
అసలు పోస్టర్లో హీరో ముఖం చూసే అలవాటుకు స్వస్తి..
పైన మేఘంలో దాసరి నారాయణ రావు పేరుంటే
అన్యధా శరణం నాస్తి..
సినిమావ హిట్టే మరి..
అదే దాసరి..
నూటాయాభై
సినిమాల సిరి..

ఆయన కొత్త ఒరవడి..
పట్టు ఉక్కు పిడి..
నిర్మాతకు ఊహించని రాబడి..
దాసరి పేరే పెట్టుబడి..
టాలెంటే పలుకుబడి..
పత్రికాధిపతిగా…
రాజకీయవేత్తగా కూడా
దాసరి ఓ ట్రెండు..బ్రాండు..
రెండు కాదు..ఎన్నో పడవల మీద కాళ్లేసి
దిగ్విజయ యాత్ర
సాగించిన ఘనుడు..
మన నారాయణుడు..
సినిమా పారాయణుడు!
దర్శకరత్న దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ..

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply