Suryaa.co.in

Entertainment

ఎన్టీఆర్ నాకు దేవుడు: రాజేంద్రప్రసాద్

దివంగత ఎన్టీఆర్ నందమూరి తారకరామారావు శత జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఈరోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్ పెట్టిన భిక్ష వల్లే తాను ఒక నటుడిగా అందరి ముందు ఉన్నానని రాజేంద్రప్రసాద్ చెప్పారు. తనకు ఎన్టీఆరే దేవుడని అన్నారు. కొన్ని ఏళ్ల పాటు తాను ఆయన పక్కనే ఉన్నానని తెలిపారు. సమాజమే దేవాలయం అని నమ్మిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మన కళ్లతో మనం చూసిన దేవుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఈ రోజు ఆ మహనీయుడు బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడినని అన్నారు. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయని చెప్పారు. పది మందికి సహాయం చేయడమే ఎన్టీఆర్ కు మనం ఇచ్చే ఘన నివాళి అని అన్నారు.

LEAVE A RESPONSE