Home » unstoppable with nbk

unstoppable with nbk

నటసింహం నందమూరి బాలకృష్ణ డిజిటల్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఆయన ఒక టాక్ షో చేస్తున్నారు. ‘unstoppable with nbk’ పేరుతో రానున్న ఈ షోకి ఇప్పటికే అధికారిక కార్యక్రమాలు కూడా పూర్తికాగా.. ఈ షో నవంబర్ 4 నుండి ఆహాలో ప్రీమియర్ టెలికాస్ట్ కానుందని ప్రోమోలో తెలిపారు. ఒక్క ప్రోమోలతోనే కాదు ఎప్పటికప్పుడు ఆహా టీం ఈ షోపై అంచనాలు పెంచేలా రకరకాల కార్యక్రమాలు చేపడుతుంది.
తాజాగా ఆహా వీడియో సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలయ్య బాబు షోలో సందడి చేయాలా.. దెబ్బకి మన అందరి థింకింగ్ మారిపోవాలా అంటూ పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన సరికొత్త ప్రోమో విడుదలకి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోండగా.. త్వరలో బాలయ్య ఎనర్జీను చూసేందుకు అభిమానులు సిద్దంగా ఉన్నారు.
ఒక్క బాలయ్య అభిమానులే కాదు.. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య బాబు ఎలా ఉంటాడు, ఎలా ప్రెసెంట్ చేస్తాడు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలయ్య లాంటి సీనియర్ స్టార్ హీరో డిజిటల్ లో అడుగుపెట్టడంతో ఈ షోపై తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఆసక్తి నెలకొంది.

Leave a Reply