డబ్బులు ఇవ్వలేదనే సినీతార కరాటే కళ్యాణి నన్ను కొట్టింది..

– నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది
– కళ్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది
– కరాటే కల్యాణి చేతిలో దెబ్బలు తిన్న శ్రీకాంత్

యూట్యూబ్ లో అశ్లీల కంటెంట్ తో ప్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిపై గురువారం రాత్రి ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి దాడి చేసింది. గురువారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో శ్రీకాంత్ ని సినీనటి కరాటే కల్యాణితో పాటు మరి కొంతమంది కలిసి చితకబాదారు. ప్రాంక్ పేరుతో మహిళలపై ఇష్టం వచ్చినట్లు శ్రీకాంత్ చేతులు వేస్తున్నాడు, ప్రాంక్ పేరుతో అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసి మహిళల గౌరవాన్ని దెబ్బతిస్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్న మహిళలను రెచ్చగొట్టి కోరికలు తీర్చుకుంటున్నాడు అంటూ కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేసి మరి కొంతమందితో కలిసి శ్రీకాంత్ బట్టలు ఊడదీసి రోడ్లపై పరిగెత్తించి కొట్టింది.

గత రాత్రి నుంచి ఈ వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా ఇవాళ ఉదయం శ్రీకాంత్ రెడ్డి దీనికి సంబంధించి ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ”నేను ఏ తప్పు చేయలేదు, నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారు. కరాటే కళ్యాణి కూడా సినిమాల్లో అలాగే చేస్తుంది. నిన్న రాత్రి నా ఇంటికి వచ్చి బయటకి రమ్మని గట్టిగా అరిచారు. నేను బయటకి వెళ్తే కళ్యాణితో పాటు మరో వ్యక్తి నన్ను తిట్టారు. కళ్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అని బెదిరించింది. పక్కన ఉన్న అబ్బాయి గొడవ ఎందుకు 70 వేలకి సెట్ చేస్తాను అన్నాడు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వను అనడంతో నాపై దాడి చేశారు, షర్ట్ చింపేసారు. కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి” అంటూ తెలిపాడు.

అయితే ముందు నుంచి కూడా ఈ శ్రీకాంత్ చేసే ప్రాంక్ లపై నిరసన వ్యక్తమవుతుంది. గతంలో చాలా సార్లు ఇతను ప్రాంక్స్ పేరుతో శృతిమించి వీడియోలు చేయడంతో పలువురు బహిరంగంగానే విమర్శించారు. ఇలాంటి వీడియోలపై నిషేధం విధించాలని కూడా కోరారు. తాజాగా కళ్యాణి ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకే అతనిపై దాడి చేయడంతో మరోసారి ఇతను వార్తల్లో నిలుస్తున్నాడు.

Leave a Reply