నవ్వించే యాక్టర్..ఈ పొట్టి ప్లీడర్!

రేలంగి..రమణారెడ్డి..
సూర్యకాంతం..ఛాయాదేవి..
ఈ నలుగురి మధ్య
ఉంటే పద్మనాభం..
నిర్మాతకు మరింత లాభం..
నటుడిగా ఆయన హాస్యమంటే
బోలో భం భం..
నిర్మాతగా మాత్రం సంక్షోభం..
సొంత సినిమాలే చేశాయి
జీవితం దుర్లభం..!

ఒక దశలో తెలుగు సినిమా కామెడీ కేరాఫ్ పద్మనాభం..
డివ్వి డివ్వి డివ్విష్టం
ఆయన హాస్యమంటే జనాలకిష్టం..
వాణిశ్రీ..శారద..
గిరిజ..మీనాకుమారి..
రమాప్రభ..ఎందరితో జతకట్టినా గీతాంజలితోనే
ముడి పడి ఉంది ఆయన ప్రభ
దేవతలా సావిత్రి నిలబడి
ఈ పొట్టిప్లీడర్ కు లాభాలు తెచ్చిపెడితే…
వరస ఫ్లాపులతో చెయ్యి కాల్చుకుని దివాళా తీసినా మిగిలాడు మర్యాదరామన్నగా!

గానగంధర్వుడిని పరిచయం చేసిన ఘనత..
శ్రీరామకథ గొప్పగా తీసినా తప్పని కలత..
కధానాయిక మొల్లతో
మెల్లగా పతనం..
హాస్యనటుడిగా మాత్రం
మూడు దశాబ్దాల విజయకేతనం…
ఎన్టీఆర్..ఏయెన్నార్..
కృష్ణ,శోభన్..రామకృష్ణ
ఎవరి కాంబినేషనైనా
పద్మనాభంతో హిట్టే…!
హైటు తక్కువైనా
హీరోలతో సమానంగా క్రెడిట్టే..
అప్పుడప్పుడూ విలను..
చేసిన మంచి దాటించలేదు
కష్టాల కొలను..
ఏదిఏమైనా నాలుగు తరాల
కామెడీ సూపర్ స్టార్లు
శివరావు,రేలంగి..
రాజబాబు..బ్రహ్మానందం..
నడుమ పద్మనాభం పేరుండడం మహదానందం..

విలక్షణ హాస్యనటుడు
బసవరాజు పద్మనాభం
వర్థంతి సందర్భంగా
నివాళి అర్పిస్తూ..

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply