Suryaa.co.in

Entertainment

పరిశ్రమ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించాలని యోచన

సినీ పరిశ్రమ కార్మికులకు సీసీసీ ఫండ్ తో కరోనా వాక్సినేషన్ అంధించేందుకుకు కృషి చేస్తామని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ , సీసీసీ నిధితో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్  గురించి ఆయన మాట్లాడుతూ.. ప్ర‌తీ స‌న్నివేశం ఉత్కంఠ‌ను క‌లిగించింద‌ని, వైల్డ్ డాగ్ చిత్రాన్ని ప్ర‌తీ ఒక్క‌రు చూడాల‌ని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం యూనిట్ ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ నటుడు నాగార్జున తదితరులు మాట్లాడారు.

LEAVE A RESPONSE