Suryaa.co.in

Entertainment

కరప నుంచి కళామతల్లి ఒడికి

-నారా రోహిత్ సినిమాకి టీవీ 5 మూర్తి దర్శకత్వం
-ప్రారంభమైన షూటింగ్
-కరపలో సందడి

కాకినాడ: ఎక్కడో పల్లెటూరులో తెలుగు మీడియం చదివి నేడు తెలుగు రాష్ట్రాలలోనే పేరెన్నిక గల జర్నలిస్టుగా మరి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు ఆ యువకుడు.ఆ యువకుని గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

కరప గ్రామానికి చెందిన దేవగుప్తాపు హర వెంకట సూర్య సత్యనారాయణ మూర్తి (టీవీ 5 మూర్తి) కరప హైస్కూల్లో చదివారు. కాకినాడ చార్టీస్ లో డిగ్రీ పూర్తి చేసి శ్రీకాకుళంలో న్యాయ శాస్త్ర పట్టా తీసుకున్నారు. అనంతరం ఈనాడు జర్నలిజం స్కూల్ కు ఎంపికై జర్నలిజంలో అడుగుపెట్టారు. నాటి నుంచి నేటి వరకు ఎదురులేని జర్నలిస్టుగా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయన టీవీ 5 ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నారు. చిన్న పల్లెటూరులో పుట్టి జాతీయస్థాయిలో అతి కొద్ది మంది నిజాయితీగల జర్నలిస్టుల్లో ఒకరుగా గుర్తింపు పొందిన మూర్తి ఇప్పుడు సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఇప్పటికే ఆయన పలు సినిమాల్లో నటించారు. ఆయన విలన్ గా నటించిన ‘ప్లే బ్యాక్’ సినిమా ప్రేక్షకుల మన్ననలు చూరగొంది. సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండే ప్రముఖ హీరో నారా రోహిత్ హీరోగా మూర్తి దర్శకత్వంలో ప్రతినిధి 2 షూటింగ్ ప్రారంభమైంది.

గతంలో నటుడిగా, పాటల రచయితగా సినిమా రంగంలో గుర్తింపు పొందారు. తాజాగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. నారా రోహిత్ హీరో కావడంతో తెలుగుదేశంకు అనుకూలంగా ఈ సినిమా ఉంటుందా, పైగా ప్రతినిధి పేరుపెట్టారు, రాజకీయ సినిమానా అన్న చర్చ జరుగుతోంది. జనవరి 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని సినిమా వర్గాలు వెల్లడించాయి. మూర్తి హైదరాబాదులో జర్నలిస్టుగా రాణిస్తూ తాజాగా సినిమా రంగంలో కూడా తనదైన స్థాయిలో ఎదగడం అందరినీ హర్ష నికి గురి చేసింది. మంగళవారం మూర్తి దర్శకత్వం వహించిన ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో ప్రతి ఒక్కరూ అతడిని అభినందిస్తున్నారు. కరపలో అతనితో చదువుకున్న పూర్వ విద్యార్థులు సంబరాలు జరిపారు. కరపలోని అతని నివాసంకు వచ్చి ఆయన తల్లిని కలిసి అభినందనలు తెలిపి వెళ్లారు.

LEAVE A RESPONSE