Suryaa.co.in

Entertainment

ఫాఫం.. సిన్మా డైరక్టర్!

సినిమా ఇండస్ట్రీలో ఒక్క రూపాయి సంపాదన లేని డిపార్ట్మెంట్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్.
అరే.. ఒక డైరెక్టర్ అయ్యిండి కూడా ఇలా అంటారేంటి? మీకేమైనా పిచ్చా అనవచ్చు మీరు.
ఎస్.. నేను చెబుతున్నది నూటికి నూరు శాతం నిజం.కొత్తగా డైరెక్టర్ లు కావాలని ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలు కొన్ని మాత్రమే చెబుతాను. మీరే ఆలోచించండి.

1) డైరెక్టర్ కావాలని వచ్చే ప్రతివాడూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాల్సిన అవసరముంది. ఎందుకంటే నెక్స్ట్ మనం ప్రొడ్యూసర్ ని వెతుక్కోవాలి అన్నప్పుడు, అసిస్టెంట్ గా ఎక్కడ ఏ సినిమాకి వర్క్ చేసావని అడుగుతారు.
ఆ అసిస్టెంట్ గా చేరిన మనం, సినిమా వర్క్ కన్న నిర్మాత , సీనియర్ దర్శకుడుకు కాళ్ళు నొక్కడం, అండర్వేర్ లు ఉతకడం.. వాళ్ళు తిన్న ప్లేట్లు కడగడం, ఇలాంటి పనుల్లో బిజీ అయిపోతాం గాని, సినిమా స్క్రిప్ట్ వర్క్ గురించి, ఎడిటింగ్ కంట్యూనిటి రిపోర్ట్ రాయడం కూడా చూసుకోలేము.అంతెందుకు? క్లాప్ బోర్డు చేతిలో పెట్టుకుంటేనే ఎంతో ఆనందం పడిపోయే పరిస్థితి మనది.

2) ఎలాగలాగొ ఐదారేళ్ళు నానా తిప్పలు పడి, ఉంటే తింటూ లేకపోతే పస్తునుంటూ పని నేర్చుకుంటాం. ఈ ఐదారేళ్ళల్లో ఇంటి వాళ్ళు బంధువులు వాళ్ళు ఈళ్ళు చేసే అవమానాలు ఎలా ఉంటాయో తెలుసా?
సినిమా సినిమా అని ఐదేళ్ళునుంచీ హైదరాబాద్ లో పడినాడు, ఏమీ పీకింది లేదు. పని పాట లేని వెదవ అంటుంటే జీవితం వద్దని పిస్తుంది.
ఇలా ఉండగా ఎవరో ఓ ప్రొడ్యూసర్ ని కాంటాక్ట్ అయితే, 10 లక్షలతో సినిమా చేస్తావా..20తో సినిమా చేస్తావా అంటాడు.
ఆ 10/20లక్షలకు కొత్తవాళ్లతో సినిమా చేద్దాం అని నిర్ణయించుకునే లోపు.. నా కొడుకున్నాడు, బామరిదున్నాడు అని హీరోని చూపిస్తారు..వాడు అందంగుండి యాక్షన్ చేయడం వస్తే పరవాలేదు.
లేకపోతే మమ్మలని ఆ పెద్దమ్మ తల్లే కాపాడాలి.ఇలా ఉండగా అన్నింటినీ సమకూర్చుకొనే లోపు, హీరోయిన్ రూం కొస్తుందా అని అడిగే నిర్మాతలకేం తక్కువ లేదండి.

3) 20 లక్షలతో సినిమా చేయాలి
మనకు దొరికిన దారి అదే..ఇక్కడే మన ట్యాలెంట్ ను నిరూపించుకోవాలి..అనే తపనతో డైరెక్టర్ అనేవాడు పేమెంట్ కూడా అడగకుండా, అన్ని పనులు తానే చేస్తూ వర్క్ చేస్తాడు. అక్కడే సులకనైపోతాడు.
డైరెక్టర్ అనే వ్యాల్యూని కోల్పోతాడు..ఇవన్నీ పట్టించుకోకుండా పని ముగించి, సినిమా త్వరగా బయటికి రాకపోతే అక్కడ కూడా, అవమానాలని ఎదురించాల్సింది డైరెక్టరే..ఏం గురూ సినిమా ఏమైంది ఎప్పుడు రిలీజ్ అని ప్రతివాడూ అంటుంటే, ఆ అవమానం డైరెక్టర్ దే.ఈ సినిమా బయటికి రాదు ..వేరే సినిమా చేతికి తీసుకోకూడదు.నా సినిమా రిలీజ్ చేసిచ్చి , ఇంకో సినిమా చేయమంటాడు మొదటి నిర్మాత.. లేకపోతే మళ్ళీ ఇతని మీదే 100 నిందలు.

4)ఎవడెవడి కాళ్ళు పట్టుకొని సినిమా బయటికి తెచ్చేస్తారనుకోండి.
సినిమా సక్సెస్ అయితే పరవాలేదు..లేకపోతే ఆ అపనింద డైరెక్టర్ పైనే.
తను కోరిన బడ్జెట్ ఉండదు..కోరిన ఆర్టిస్ట్ ఉండడు..ఇవన్నీ పక్కన పెడితే..
ఓ డైరెక్టర్ కి ప్రశాంతంగా సినిమా డైరెక్షన్ చేసే అవకాశం ఉండదు.
ఇంకెలా సినిమా బాగుంటుంది?
ఐనా డైరెక్టర్ బాగా చేసాడంటే అతని కష్టం ఎంత ఉంటుందో ఆలోచించండి.
కానీ ఆ సక్సెస్ కు వ్యాల్యూ దొరుకుతుంది అనుకుంటే దొరకదు.
ఎవ్వరో వేరే నిర్మాత పిలిచి పని ఇస్తాడు.
కానీ నానా కష్టాలు పడి..ఇచ్చిన బడ్జెట్ లో సినిమా చేసి, సక్సెస్ ఇస్తే ఈ నిర్మాత ఇంకో డైరెక్టర్ వెంట పడతాడు. కానీ మళ్లీ సినిమా ఇవ్వడు.. కేవలం 20 లక్షలతో సినిమా తీస్తున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన తనలాంటి వారికి , కనీసం పేమెంట్ ఇవ్వకపోయినా, ఇప్పించేందుకు పోయినా పాపం డైరెక్టర్ దే..ఇంకా ఇలాంటివి చాలానండి…

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE