నటనే బయాలజీ.. అతడే శివాజీ..!

తమిళ చిత్రపరిశ్రమలో
ఆనాడు ఇద్దరు గణేశన్లు
ఒకరు జెమిని స్టూడియోలో పనిచేసి రాణించిన
జెమినీ గణేశన్
మరొకరు
శివాజీ పాత్రలో
అద్భుతంగా నటించి అయ్యాడు
శివాజీ గణేశన్..
అభినయంలో
నిజంగా లయన్
ఛత్రపతి పాత్ర
ఆయనే వేస్తేనే సార్థకం
అలాగే అయ్యాడు
నడిగర్ తిలకం..!

చదవడమే రాని శివాజీ
ఎంత డైలాగైనా
ఒక్కసారి వినేసి
చెబుతుంటే సింగిల్ టేకే
చెప్పాక హాట్ కేకే..
ఈ తరం భాషలో
చెప్పాలంటే
కెవ్వుకేకే!

ఎంత టాలెంట్ పొదివి సృష్టించాడో ఆ బ్రహ్మ..
అభినయంలో సంచలనం
ఓ వీరపాండ్యకట్టబ్రహ్మ..
గణేశన్ ఆహార్యం అదుర్స్
డైలాగులు నాటి
జనాలకు కంఠోపాఠం..
అందునా జగ్గయ్య కంచుకంఠం
మొత్తంగా ఆ సినిమా
కొన్ని తరాల నటులకు
ఓ అద్భుత పాఠం..!

అంతటి ఎన్టీఆరే
మెచ్చిన కర్ణుడు..
ఆయన నచ్చి ఇచ్చిన
అలెగ్జాండర్..
అక్కినేనికి మంచి మిత్రుడు
ప్రేమనగర్ తమిళ వర్షన్
వసంతమాళిగై నాయకుడు
హిట్టు కొట్టిన
గొప్ప ప్రేమికుడు..
తెలుగుకు ఎన్టీఆర్,ఏయెన్నార్
రెండు కళ్లైతే
తమిళానికి ఎంజీఆర్,శివాజీ
నేత్ర ద్వయం..
చారిత్రక అభినయం..!

పరాశక్తితో మొదలైన నటప్రస్థానం..
ఎన్నో తరాల నటులతో సావాసం..
కొందరితో పోటీ పడుతూ
తిప్పి మీసం..
ఎస్వీఆర్ అంతటి పెద్దాయనతో
ఒరేయ్ అనే చనువు..
వయసు మళ్లీనా తగ్గని ఉత్సాహం..
రజనీ నరసింహలో పుత్రోత్సాహం..
క్షత్రియపుత్రుడుతో
కమల్ కూ
అయ్యాడు నాన్న..
ఈ ప్రభు నాన్న..
తమిళ తంబీల పెద్దన్న..
కట్టింది ఏ వేషమైనా
నటనకు ఆయనే భాష్యం..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply