సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు

-బండి సంజయ్ కుమార్

ప్రముఖ సినీ హీరో, నిర్మాత, దర్శకుడు కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి) గారు నేడు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావుతో నిన్నటి రోజున ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇంతలోపే కృష్ణ గారు మరణించారన్న వార్త విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతి చెందాను.

అనేక తెలుగు చిత్రాలలో సమాజాన్ని తట్టి లేపే విధంగా, ప్రజలను చైతన్యం చేసే ఎన్నో చిత్రాలలో హీరో కృష్ణ గారు నటించి జీవించారు. వారు సినిమాల్లో నటిస్తున్నప్పుడు ప్రజలకు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదిరించే మనస్తత్వాన్ని రేకెత్తించారు.

వారు నటించినటువంటి చిత్రాలన్నీ సమాజాన్ని చైతన్యం చేసే చిత్రాలే. స్వతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు ఒక ప్రముఖమైన పోరాటం అలాంటి పోరాటాన్ని తన నటన ద్వారా అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాన్ని ప్రజలకు తెలియజేసిన వ్యక్తి హీరో కృష్ణ గారు. ఏ పాత్ర పోషించిన ఆ వర్గం తమ నాయకుడిగా తమ మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న విశిష్టమైన నటుడు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ, తెలుగు ప్రజలు గొప్ప సినీ నటుడిని కోల్పోయింది. వారి మరణం తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు. సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

Leave a Reply