మద్యం కేసుకు సంబంధించి అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ సోమ వారం తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కవితకు గత నెల 26న కోర్టు 14 రోజుల జ్యుడీషి యల్ కస్టడీ విధించింది. ఆ సమయం ముగియడంతో ఈడీ అధికారులు సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరపున అడ్వొకేట్ జోహెబ్ హుస్సేన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందువల్ల కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరారు. ఇదే సందర్భంలో విత తరపున అడ్వొకేట్ నితీశ్ రాణా వాదిస్తూ కవిత జ్యుడీషి యల్ కస్టడీని పొడిగించాలని కోరడానికి ఈడీ వద్ద కొత్త కారణాలేమీ లేవన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతు న్నదని, అప్పటి నుంచి కవిత దర్యాప్తును ప్రభావితం చేస్తున్న దని ఈడీ ఆరోపిస్తూనే ఉందన్నారు. కానీ ఇప్పటివరకు కవిత సహకరించారని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా తీర్పును కాసేపు రిజర్వ్ చేశారు. అనం తరం కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్టు తీర్పు ఇచ్చారు. తిరిగి ఈ నెల 23న కవితను కోర్టులో హాజరు పరచాలని జడ్జి ఆదేశించారు.
Devotional
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?
గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి? ప్రదక్షిణ అని దేనిని అంటారు?? అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు. ఋగ్వేదం…
Sports
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్‌లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…
చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్
భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్-2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగిన 14వ రౌండ్లో గుకేశ్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్లు) రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం…