Suryaa.co.in

Andhra Pradesh

30 వేలమంది తల్లులకు జగన్‌ కుచ్చుటోపి

-ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య అంటూ దందాలు
-ఎన్నికల ముందు బయటపడ్డ రహస్య జీవోలు
-వారికి ఫీజులు చెల్లించకుండా దారుణ మోసం
-బలవంతంగా కట్టించుకుంటున్న యాజమాన్యాలు
-విద్యార్థుల జీవితాలతో ఆటలు..
-విద్యా వ్యవస్థనూ నాశనం చేసిన జే గ్యాంగ్‌

-వందల కోట్లు బొక్కి…
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

ఎన్నికలకు ముందు జగన్‌ ప్రభుత్వం చేసిన దారుణ మోసం బయటపడిరది. 30 వేల మంది తల్లులకు కుచ్చుటోపి పెట్టిం ది. ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య అంటూ వారికి ఫీజులు చెల్లించకపోవటంతో యాజమాన్యాలు బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్న వైనం వెలుగుచూసింది. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ మీడియా సమావేశంలో ఆ వివరాలను వెల్లడిరచారు.

అమ్మఒడి పేరుతో 30 వేల మంది తల్లులను జగన్‌రెడ్డి దారుణంగా మోసం చేశాడని అందుకు సంబంధించి ఎన్నికల ముందు బయటపడ్డ రహస్య జీవోలను చూపించారు. పేపర్లు, పోస్టర్లు, వైసీపీ బ్లూ మీడియా, వైసీపీ వెబ్‌ సైట్లలో ఉచిత విద్యపై కొట్టిన డబ్బాలన్నీ మోసం అని తేలిపోయిందన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలో పేద విద్యా ర్థులకు ఉచిత విద్య అంటూ జగన్‌రెడ్డి చెప్పిన కళ్లబొల్లి కబుర్లు అన్నీ అబద్ధాలే అని స్పష్టమైందన్నారు. జగన్‌రెడ్డి చర్యలతో పేద విద్యార్థుల తల్లిండ్రులపై పెను భారం పడిరదన్నారు. ఉచితమని ఉత్తుత్తి కబుర్లు చెప్పి రెండేళ్లుగా పాఠశాలలకు సర్కార్‌ డబ్బు చెల్లించకపోవడంతో… పిల్లలకు తల్లిదండ్రులే ఫీజులు కట్టుకునే పరిస్థితి వచ్చినట్లు వివరించారు.

చెప్పింది ఒకటి… చేసింది మరొకటి
ఎన్నికల ముందు అందరికీ అమ్మఒడి అని చెప్పి గెలిచాక మాట మార్చిన మోసగాడు జగన్‌రెడ్డి అని దుయ్యబట్టారు. తన భార్య భారతిరెడ్డి చెప్పిన మాటను కూడా జగన్‌ తప్పాడని, అధికారం చేపట్టాక ఒక్కరికే అమ్మఒడి ఇస్తూ మిగిలిన విద్యార్థు లను చదువుకు దూరం చేశాడని విమర్శించారు. ఈ తుగ్లక్‌ రెడ్డి చర్యలతో ఐదేళ్లలో 4,750 పాఠశాలలు మూతబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలకు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు దూరం అయ్యారని విజయ్‌కుమార్‌ మండిపడ్డారు.

ఉత్తుత్తి ప్రసారాలతో విద్యార్థులను మోసం
ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత విద్య అంటూ కురపత్రాలు, పోస్టర్లు, వైసీపీ వెబ్‌సైట్‌లలో ఉత్తుత్తి ప్రసారం, ప్రచారాలతో జగన్‌ సర్కార్‌ విద్యార్థులను మోసం చేసింది. జగన్‌ మాటలు నమ్మి ఉచితమని పాఠశాలల్లో చేరిన విద్యార్థులను వైసీపీ ప్రభుత్వం నిలువునా ముంచిందన్నారు. రెండేళ్లుగా విద్యార్థులకు చెల్లించా ల్సిన ఫీజులను చెల్లించలేదు. బకాయిల కోసం ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఆందోళనకు దిగటంతో రహస్య జీవోలను బయట పెట్టి అమ్మఒడి డబ్బులు కట్టుకోమని చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. జగన్‌ నిర్వాకంతో ఫీజులు కట్టలేక ప్రైవేట్‌ విద్యాసంస్థలు పెడుతున్న ఒత్తిడిని తట్టకోలేక చాలామంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యారని తెలిపారు. విద్యార్థుల ను విద్యకు దూరం చేసిన జగన్‌కు తప్పకుండా అమ్మల ఉసు రు తగులుతుందని వ్యాఖ్యానించారు.

రహస్య జీవోలు వారికి తెలియదట!
ఐఏఎస్‌ ఆఫీసర్లకు, డీఈవోలకు కూడా తెలియని రహస్య జీవోలను విడుదల చేసి వారిని కూడా బురిడీ కొట్టించిందని, ఏ జీవోలు విడుదలు చేస్తుందో కూడా వారికి తెలియదని అధికారులు సమాధానం చాలా విడ్డూరంగా ఉందన్నారు. కీలక పదవుల్లో ఉండి వైసీపీకి తొత్తుల్లా పనిచేస్తూ బడి పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. వారు జగన్‌కు భయపడి నడచుకుంటున్నారని, ఇప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారుల తప్పు అంటూ కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్‌, బొత్స
ప్యాలెస్‌ వదలని జగన్‌, బడి పిల్లల భవిష్యత్‌ పట్టని బొత్సలు విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయటమే పనిగా పెట్టుకున్నా రని విజయకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్లు బొక్కుతూ… విద్యావ్యవస్థను సర్వనాశనం చేసి ఫీజులు చెల్లించ కుండా బడి పిల్లల జీవితాలను రోడ్డున పడేశారని దుయ్యబ ట్టారు. జగన్‌ అసమర్థ పాలన వలనే విద్యార్థుల చదువుకు దూరం అయ్యారని, పదిలో ఉత్తీర్ణత దారుణంగా పడిపోయిం దని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వంలోనే విద్యార్థులకు మేలు
టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందింది. విద్యార్థుల ఉత్తీర్ణత పెరిగింది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో విద్య ను పూర్తిగా ఉచితం చేసింది. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి న వెంటనే పిల్లలకు చెల్లించాల్సిన బకాయిలను టీడీపీ పూర్తిగా చెలిస్తుంది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తుందని, వైసీపీలా మోసం చేసే ప్రభుత్వం మాది కాదని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE