Home » శ్రీరాముని కల్యాణోత్సవ ప్రత్యక్షప్రసారానికి అనుమతివ్వండి

శ్రీరాముని కల్యాణోత్సవ ప్రత్యక్షప్రసారానికి అనుమతివ్వండి

– ఈసీకి మంత్రి కొండా సురేఖ లేఖ

ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఇప్పటికే కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించినందున మంత్రి సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కి ఈ మేరకు లేఖ రాశారు. కులమతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు వీక్షించాలనుకునే కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారాలను ఎన్నికల కోడ్ నుంచి మినహాయించాలని కోరారు. భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానం ప్రాశస్త్యం, ఆచార సాంప్రదాయాలు, భక్తుల నమ్మకాలు, కళ్యాణ మహోత్సవం సందర్భంగా దాదాపు 40 ఏళ్ళ నుంచి సాగుతున్న ప్రత్యక్ష ప్రసారాలు మొదలైన అంశాలను మంత్రి సురేఖ లేఖలో ప్రస్తావించారు.

Leave a Reply