రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4 వ స్థానంలో ఉండడం సిగ్గుచేటు
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి , బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లో గత కొన్ని రోజులుగా ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరం. గత రెండు సంవత్సరాలుగా అకాల వర్షాల కారణంగా పంట నష్ట పోయి అప్పుల పాలైన రైతులు దిక్కు తోచక బలవన్మరణానికి పాల్పడడo చాలా బాధాకరం. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.
రైతు ఆత్మహత్యల్లో దేశం లోనే తెలంగాణ 4 వ స్థానంలో ఉండడం సిగ్గుచేటు. 2017 నుండి 2022 వరకు తెలంగాణ లో నమోదైన రైతు ఆత్మహత్యలే 3055. లెక్క ల్లో లేనివి ఇంకా చాలా ఉన్నాయి. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశమంతా ఫసల్ భీమా యోజన పధకం అమలు చేస్తుంటే తెలంగాణా లో ఆ పథకాన్ని అమలు కాకుండా చేసి రైతుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ రైతు ఆత్మహత్యలన్ని రాష్ట్ర ప్రభుత్వo చేస్తున్న హత్యలే.
కూట్లే రాయి తీయలేనొడు ఎట్లే రాయి తీస్తనని… తెలంగాణా లో రైతుల బాగోగులు చూడలేనొడు ‘‘ ఆబ్ కీ భార్ కిసాన్ సర్కార్ ‘‘ అనుకుంటూ ఇతర రాష్ట్రాలు పట్టుక తిరుగుతుoడు. సొంత రాష్ట్రం లో రెండు సార్లు అధికారం లోకి వచ్చి వ్యవసాయ ప్రణాళిక ను తయారు చేయలేకపోవడం రైతుల పట్ల మీకున్న కపట ప్రేమ ను సూచిస్తుంది.చనిపోయిన రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకుని , పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
తెలంగాణలో రైతు సోదరులు ఎవరూ ఆత్మ హత్యలు చేసుకోవద్దని కోరుతూ….వచ్చే ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదంతో BJP అధికారం లోకి వచ్చాక ఫసల్ భీమా యోజన పథకం తో పాటు వ్యవసాయం రంగం లో కేంద్రం ప్రవేశ పెట్టిన అన్ని పథకాలు రాష్ట్రం లో అమలు చేసి రైతు సంక్షేమానికి పెద్ద పీట వేయడం తో పాటు రైతులకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం.