ఆర్ ఆర్ ఆర్ పై లోకేశ్ ట్వీట్

– చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్

‘ ఆర్ ఆర్ ఆర్ ‘ రికార్డులు బద్ధలు కొట్టాలని కోరుకుంటున్నానని తెదేపా నేత నారా లోకేశ్ అన్నారు. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. మూవీ గొప్ప అనుభూతి ఇచ్చిందన్న లోకేశ్.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు అభినందనలు తెలిపారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమాపై తెదేపా నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ చిత్రం ద్వారా గొప్ప అనుభూతి అందించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.

ఆర్ఆర్ఆర్ సృష్టికర్త రాజమౌళి, తారాగణానికి ‘నా హృదయపూర్వక శుభాభినందనలు’ అని పేర్కొన్నారు. ఈ వారం కుటుంబసమేతంగా సినిమాను చూస్తానన్నారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు లోకేశ్.
rr

Leave a Reply