Suryaa.co.in

Entertainment

కెవి రెడ్డి రూటే వేరు

(వెలగపూడి గోపాలకృష్ణ)

స్క్రీన్ ప్లే అంటే కె.వి.రెడ్డి గారి దగ్గరే చూడాలంటారు.
ఒక్క సీను కూడా అనవసరం అనిపించదు.
మాయాబజార్ 3 గంటల సినిమా ముప్పావు గంటే చూసినట్లుంటుంది!
గుణసుందరి కథ తీసేటప్పుడు ఒక సీన్లో డైలాగులు స్టాప్ వాచ్ పెట్టుకుని ఎంత టైం పడుతుందో చూసుకునేవారు.
అసిస్టెంట్ నోట్ చేసుకుని 2 నిముషాలన్నాడు.
ఇంకో అర నిముషం కలపండి…ఇక్కడ రాజుగా యాక్ట్ చేసేది గోవిందరాజు సుబ్బారావు గారు…ఆయన మెల్లగా వారి ధోరణిలో చెపుతారు!
మనం చెప్పినట్లు చెప్పరు.
అది పర్ఫెక్ట్ టైమింగ్ అంటే.
వారు 1955 లో తీసిన దొంగ రాముడు సినిమా …పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఒక పాఠ్యాంశం గా మారిందంటే కె.వి.రెడ్డి గారి ఘనతే దానికి కారణం.

ముతక ఖాదీ పంచె, పొట్టి చేతుల చొక్కా, కాయితాలు, పర్సు పెన్నులతో ఎత్తుగా ఉండే జేబు, భజం మీద పై కండువా తో సింపుల్ గా ఉండే రెడ్డి గారిని చూస్తే..
ఎవ్వరూ దర్శకుడనుకోరట. ఇంగ్లీషులోనే మట్లాడేవారట.
అందరినీ బ్రదర్ అని సంభోదించేవారు. మన అన్న గారు ఎన్.ట్.ఆర్….
వారి దగ్గరే ఈ బ్రదర్ అనే పదం అలవాటు చేసుకున్నారట.

అసలీ జెనరేషన్ కు….కె.వి.రెడ్డి ని పరిచయం చెయ్యాలి.
బి.ఎన్.రెడ్డి ఎవరు? బి.నాగి రెడ్డి ఏవరు?
రోహిణి ప్రొడక్షన్స్, వాహినీ ప్రొడక్షన్స్, విజయా ప్రొడక్షన్స్….ఇవన్నీ ఎవరివి?….అని ఓ కన్ ఫ్యూజన్.
హెచ్.ఎం.రెడ్డి గారని టాకీ పులి…ఆయన గారు…బి.ఎన్.రెడ్డి & మూలా నారాయణ స్వామితో కలిసి…రోహిణీ ప్రొడక్ష్సన్స్ స్థాపించి…1938 లో గృహలక్ష్మి మూవీ తీశారు.
దానికి క్యాషియర్ గా పనిచేశారు…మన కె.వి.రెడ్డి. గారు.
సినిమా బాగా ఆడింది. కాకపోతే…కాంచనమాల వ్యాంప్ అందులో. ఆవిడతో కాస్త ఆ కాలంలోనే అభ్యంతర కరమైన…యాక్షన్ చేయించారని….
బి.ఎన్.రెడ్డి గారు…హెచ్.ఎం.రెడ్డి గారితో…విబేధించి…
మూలా నారాయణస్వామితో కలిసి…విడిగా స్వంత సంస్థ వాహినీ ప్రొడక్షన్స్ స్థాపించారు.
అప్పుడు వారితో కలిసి కె.వి.రెడ్డి గారు కూడా వచ్చేశారు.
వాహినీ సంస్థ లో బి.ఎన్.రెడ్డి గారు తీసిన 3 మూవీస్ కు ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించారు.
ఆ 3 సినిమాలు….
వందేమాతరం(1939), సుమంగళి(1940), దేవత(1941)…
అవి కళా ఖండాలనిపించుకున్నా కాసులు ఆట్టే రాలలేదు!
ఈ లోగా కె.వి.రెడ్డి గారు…భక్త పోతన స్క్రిప్ట్ రెడీ చేసుకుని….డైరెక్షన్ ఛాన్స్ అడిగితే….తక్కిన ఇద్దరికీ నమ్మకం లేదు!
అయినా….పారితోషికం వద్దని……కేవలం లాభాల్లో వాటా చాలని…అతి కష్టంతో…తీశారు…భక్త పోతన.(1943).
అదే వాహినీ ని నిలబెట్టింది. విశేష లాభాలనార్జించి పెట్టింది.
ఆ తరువాత….బి.ఎన్.రెడ్డి & కె.వి.రెడ్డి …ఒకరి తరువాత ఒకరు…మూవీస్ డైరెక్ట్ చేసేట్లు…అనుకుని…కొనసాగారు.
కానీ…1949 లో వాహినీ మూల స్తంభాలలో..మూలమైన…మూలా నారాయణ స్వామి ఆర్ధికంగా చితికి పోయి….సంస్థను….
అప్పుడే స్థాపించిన విజయా ప్రొడక్షన్స్ లో విలీనం చేశాడు. అలా ఏర్పడిందే….విజయా – వాహినీ ప్రొడక్ష్సన్స్….సంస్థ.
క్రమేణా…విజయా ప్రొడక్షన్స్ అయ్యింది. అది నాగిరెడ్డి – చక్రపాణి లది.
ఈ నాగిరెడ్డి ఎవరో కాదు….బి.ఎన్.రెడ్డి గారి సొంత తమ్ముడే.
బి.ఎన్.రెడ్డి…బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి.
బి.నాగిరెడ్డి…బొమ్మిరెడ్డి నాగిరెడ్డి.
కె.వి.రెడ్డి గారికి….వీరికి…..ఆర్ధిక లావాదేవీలు తప్ప..
బంధుత్వం ఏమీలేదు.

**
దర్శకుడిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశాడు.
చాలా కసరత్తు చేసి స్క్రిప్టు పూర్తిచేయడం, ఒక్కసారి బౌండ్ స్క్రిప్టు పూర్తయ్యాక….. ఇక దానిలో చిత్రీకరణ దశలో ఏమాత్రం మార్పుచేయకపోవడం ఆయన పద్ధతి.
ఎన్ని అడుగుల ఫిల్మ్ తీయాలనుకుంటే అన్నే అడుగులు తీయగలగడం ఆయన ప్రత్యేకతల్లో ఒకటి.
ముందు రిహార్సల్స్ చేయించి, సంతృప్తిగా వచ్చాకే షూటింగ్ చేసేవాడు.

భక్త పోతన(1943),
యోగి వేమన(1947),
గుణసుందరి కథ(1949),
పాతాళ భైరవి(1951),
పెద్దమనుషులు(1954),
దొంగరాముడు(1955).
మాయాబజార్(1956).
పెళ్ళినాటి ప్రమాణాలు(1959),
జగదేక వీరుని కథ(1961),
శ్రీకృష్ణార్జున యుధ్ధం(1963),
సత్య హరిశ్చంద్ర(1965),
ఉమా చండీ గౌరీ శంకరుల కథ(1968),
భాగ్య చక్రం.(1968)
&
శ్రీకృష్ణ సత్య(1971).

వీటిలో… పెళ్ళినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుధ్ధం & భాగ్య చక్రం…మూవీస్ కు నిర్మాత కూడా కె.వి.రెడ్డి గారే. జయంతి పిక్చర్స్ అని సొంత బానర్ లో తీశారు.
కె.వి.రెడ్డి సినిమాలు భారీ విజయాలు సాధించి, నిర్మాణ సంస్థలకు విపరీతమైన లాభాలు, ఎంతో పేరు తెచ్చిపెట్టేవి.

LEAVE A RESPONSE