సంబరంగా సూర్యకాంతం శతాబ్ది పురస్కారాలు

సీనియర్ నటి అన్నపూర్ణ, వివిధ రంగాల ప్రముఖులను సత్కరించిన ఎఫ్ టి పీ సీ ఇండియా తెలుగు సినిమా వేదిక

అర్ధశతాబ్దంపాటు వెండితెరను ఏలిన సూర్యకాంతం శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎఫ్ టీ పీ సి ఇండియా – తెలుగు సినిమా వేదిక సంస్థలు సీనియర్ నటి అన్నపూర్ణతోపాటు నటీ నటులు రాగిణి, జ్యోతి, సంధ్య జనక్, అజయ్ ఘోష్ మరియు వివిధ రంగాల ప్రముఖులను “సూర్యకాంతం శతాబ్ధి పురస్కారం” పేరుతో ఘనంగా సత్కరించాయి. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు, దర్శకులు వి.సముద్ర, దొరై రాజ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ అతిధులుగా విచ్చేసి అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు.

నిర్వాహకులు చైతన్య జంగా – విజయ్ వర్మ ఈ ఉత్సవాలు నిర్వహించడం , తమకు ఈ పురస్కారం అందించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అవార్డు గ్రహీతలు / అతిధులు అన్నపూర్ణ, రాగిణి, అజయ్ ఘోష్, జ్యోతి, కీర్తి నాయుడు, అను ప్రసాద్, మోనికా రెడ్డి, సావిత్రి,, యామిని వంగా, సుహాసిని పాండ్యన్, శ్రావిక చౌదరి, లిరీసా, స్నేహా చౌదరి, విజయ మాధవి, డింపుల్ ప్రియాంక, సిద్దార్థ్ రాజ్, రోజా భారతి, పేర్కొన్నారు

Leave a Reply