Suryaa.co.in

Entertainment

‘వ్యూహం’లో రిలయన్స్‌పై దాడులు.. శవం పక్కన సంతకాల సీన్లు ఉంటాయా?

(మాదల రాజేంద్ర)

క్రైస్తవ లాబీని పంపి సోనియా గాంధీ కాళ్ల మీద కుటుంబం మొత్తం వెళ్లి పడిపోయి, పార్టీని విలీనం చేస్తానని చెప్పి బెయిల్ సంపాదించుకుని బయటకు వచ్చిన మడమ తిప్పని వీరుని కథే ఈ వ్యూహం చిత్రమా?

చిన్నాన్న వివేకానందరెడ్డిని చెంపదెబ్బ కొట్టి ఎంపీ పదవికి రాజీనామా చేయించి అక్కడ్నుంచి పోటీ చేద్దామని అనుకుంటే సోనియాకి తెలిసి రాజశేఖర్‌రెడ్డికి చివాట్లు పెట్టిన యథార్థ సంఘటన కూడా ఈ వ్యూహంలో చూపిస్తారా?

తండ్రి శవం వద్ద సీఎం పదవి కోసం సంతకాలు సేకరించే సన్నివేశాలు కూడా ఉంటాయా? వ్యూహం సినిమాలో?

తండ్రి డెడ్‌బాడీ పక్కన పెట్టుకుని సీఎం పదవి కోసం సంతకం పెట్టాలని అడిగితే అవతలికి పోండని ప్రజారాజ్యం నేత చిరంజీవి ఛీకొట్టిన సన్నివేశాలు ఉంటాయా? వ్యూహం సినిమాలో?

తండ్రి మరణం వెనుక రిలయెన్స్ హస్తం ఉందని జనాలని గొర్రెలను చేసి తర్వాత ఆ ఆరోపణను గంగలో కలిపేసి అదే రిలయెన్స్ వాళ్లకి రాజ్యసభ పదవి ఇచ్చిన సన్నివేశాలు కూడా ఉంటాయా? వ్యూహం సినిమాలో?

రాష్ట్రంలో జరిగిన సహజ మరణాలు అన్నింటినీ తండ్రి ఖాతాలో వేసి ఆ పేరుతో శవ రాజకీయం ఎలా చేశారో? దాని వెనుక వ్యూహం ఏంటో ఈ వ్యూహం సినిమాలో చెబుతారా?

చావు ఇంటికి పరామర్శకు వెళ్లేటప్పుడు మనిషి అనేవాడు ఎవడన్నా ఎలా వెళతాడు? కానీ చినబాబు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ, చప్పట్లు, ఈలలు, *నినాదాలతో ఓ విజయోత్సవంలా వెళ్లటాన్ని ఏ యాత్ర అనాలో ఈ వ్యూహం సినిమాలో చెబుతారా?

ఇలాంటి కొడుకునా నేను కన్నది అని ఆవేదనతో యువనేతను బెంగుళూరు పంపించేసిన సన్నివేశాలు కూడా ఉంటాయా వ్యూహం సినిమాలో?

తండ్రి పోతే తనయుడికి చెందటానికి ముఖ్యమంత్రి పీఠం అనేది రాచరిక వారసత్వం కాదు. ఇది ప్రజాస్వామ్యం. తండ్రి చావుతో పాటు, ఆయన అభిమానుల *చావులను కూడా వాడుకుని చివరకి ఈ పులకేశి జనాలను ఎలా చావగొడుతున్నాడు అనేదే ఈ వ్యూహం సినిమా క్లయిమాక్సా?

ఫైనల్‌గా వ్యూహం సినిమా రివ్యూ ఒక్క ముక్కలో చెప్పాలంటే…
ఒక సైకో గురించి ఇంకో సైకో సినిమా తీశాడు.

LEAVE A RESPONSE