Suryaa.co.in

Entertainment

కాస్త స్పీడు పెంచు గురూ!

ప్రశ్న అంటే ప్రవల్లిక..
అయితే అర్థం కాని
ఓ ప్రశ్న..
రాజమౌళి పంచవర్ష ప్రణాళిక!
క్లాప్ కొడితే
వత్సరాల తరబడి నిర్మాణం..
ఏమిటో ఆ కారణం..!?
పూర్వం లవకుశ లేటు
నిర్మాతకు డబ్బుల లోటు..
మరి జక్కన్న సినిమా
విషయంలో ఎందుకో
అలాంటి డౌటు!!

హిట్టు మీద హిట్టు
కొట్టిన మగధీర..
అనుకున్న రేంజి వచ్చేదాకా
రాజీ పడని విక్రమార్కుడు..
ఎంత బడ్జెట్ కైనా సై అంటే సై
అనే సింహాద్రి..
దర్శకేంద్రుడి స్టూడెంట్ నం.1
అన్నీ బాగా చేసే
టాలీవుడ్ బాహుబలి..
హీరోలకు మాత్రం
కొన్ని సంవత్సరాలు బలి!

విఠలాచార్య అడతా పాడతా
తీసేస్తే బందిపోటు..
రాజమౌళి పడుతూ లేస్తూ
తీస్తే బాహుబలి..
1800 కోట్లతో తీరిన
ఆయన ఆకలి..
పెళ్లి కాని ప్రభాస్
గోరుచుట్టుపై మాత్రం
ఓ రోకలి!

జక్కన్న సినిమా తీస్తే సక్సెసే
మరి ఈ లేటు..
ఏమిటో ఆ ఫేటు?
రెండు కథలు..
ఇద్దరు హీరోలు
ఆర్ ఆర్ ఆర్..
మూడేళ్లు తకరార్..
రిలీజై సంషేర్..
ఇంకో సినిమా వచ్చేలోగా
మరో మూడేళ్లు పరార్..!

ఓ జక్కన్నా..
నీ ప్రతిభ అనల్పం..
కానీ..తొందరగా పూర్తి చేస్తే
నీ ప్రతి సినిమా
ఓ శిల్పం..
కొన్ని కథలు
కాపీ కొట్టి తీసినా
నీ దర్శకత్వంలో వస్తే
కాస్త ఎక్కువ
మంచి సినిమాలు…
భావి దర్శకులకు ఓనమాలు!

ఇ.సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE