మల్టీఫ్లెక్స్ సినిమా థియేటర్స్ లో అయోధ్య ప్రతిష్టా మహోత్సవ ప్రత్యక్ష ప్రసారం

– టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే
– కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్ కాంబో కూడా

ఆంధ్ర ,తెలంగాణ ప్రజానీకానికి శుభవార్త.. అయోధ్య రాములవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాన్ని లైవ్ లో చూసేందుకు ముందుకు వచ్చిన టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే.

దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సోమవారం (జనవరి 22) బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు దేశ విదేశాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలిరానున్నారు. అలాగే ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. మరికొందరు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా అయోధ్య రాముడి పండగను చూసే అవకాశం కల్పిస్తున్నాయి ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌, ఐనాక్స్‌. అది కూడా కేవలం 100 రూపాయల టికెట్‌తోనే. దేశంలోని 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య రాముడి పండగను ప్రత్యక్ష ప్రసారం చేసందుకు పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిగ్‌ స్క్రీన్‌పై ఈ మహాక్రతువును వీక్షించవచ్చు

ఇది సినిమా టిక్కెట్ ధర మాత్రమే కాదు, ఇందులో కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్ కాంబో కూడా ఉంటుంది. గతంలో పీవీఆర్‌, ఐనాక్స్‌ లు వన్డే ప్రపంచ కప్‌ మ్యాచల్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ‘ఇదొక చారిత్రక ఘట్టం. అందుకే పెద్ద తెరపై చూసేందుకు అయోధ్య రాముడి ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతం దత్తా తెలిపారు. జనవరి 22న మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తుంది.

Leave a Reply