Suryaa.co.in

Editorial

వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోండి

-పథకాలు పంపిణీ చేయవద్దు
-ఈసీ సంచలన నిర్ణయం
-‘సూర్య’ వార్తకు స్పందన
-ఎట్టకేలకు కదిలిన ఎన్నికల సంఘం
( అన్వేష్)

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు పై వస్తున్న ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు విధులు పై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది.

సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే నగదు బ్యాంకులు ద్వారా బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా వాలంటీర్ల నుంచి ఇప్పటిదాకా ఫోన్లు, రికార్డులు స్వాధీనం చేసుకోలేని వైఫల్యంపై ఇటీవల మహానాడు దినపత్రికలో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.

‘సూర్య’ వార్తకు స్పందన
కాగా వాలంటీర్ల నుంచి ఇప్పటిదాకా ఫోన్లు, రికార్డులు స్వాధీనం చేసుకోలేని వైఫల్యంపై ఇటీవల ‘సూర్య’ వెబ్ సైట్ లో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఎన్నికల సంఘం కదిలినట్టయింది. కొత్తగా వచ్చిన ముగ్గురు సీనియర్ అధికారులు రంగంలోకి దిగి, తమ పని ప్రారంభించక ముందే.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చర్యల కొరడా ఝళిపించడం విశేషం. వాలంటీర్ల పనితీరు, వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు కూటమి ఇప్పటివరకూ లెక్కలేనన్ని ఫిర్యాదులిచ్చింది. ఇది కూడా చదవండి: పెన్షన్..టెన్షన్

కాగా వాలంటీర్ల నుంచి ఇప్పటివరకూ ఫోన్లు- సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకోలేని నిర్లక్ష్యంపై ఇటీవలి ‘సూర్య’ వెబ్ సైట్ ప్రత్యేక కథనం వెలువరించింది. వాలంటీర్ల వద్ద ఉన్న సిమ్ ఫోన్లు, మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ కార్డులను స్వాధీనం చేసుకోకపోవడం వైసీపీకి లాభిస్తుందని ఆ కథనంలో సవివరంగా విశ్లేషించింది. మరో వైపు కలెక్టర్లు సైతం వాలంటీర్ల నుంచి సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోవాలని ఈసీ నుంచి ఆదేశాలు రాకపోతే తామేం చేయాలని ప్రశ్నించిన వైనాన్నీ ‘మహానాడు’ కథనం పేర్కొంది. ఇక వాలంటీర్ల ద్వారానే సామాజిక పించన్లు పంపిణీ చేయాలని సెర్ప్ ఆదేశాలు జారీ చేయడంపైనా వివాదం తలెత్తింది. వాలంటీర్లు ఎలాగూ వైసీపీ కార్యకర్యలే కాబట్టి.. వారి చేతికి పించన్ల నగదు ఇస్తే, అది వైసీపీ ప్రచారానికి అక్కరకొస్తుందన్న కూటమి ఆందోళననూ ‘మహానాడు’ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది.

ఈ నేపథ్యంలో వాలంటీర్ల నుంచి సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకోవాలని ఈసీ ఆదేశించడం విశేషం. అదేవిధంగా వారితో సామాజిక పించన్లు పంపిణీ చేయాలన్న సెర్ప్ ఆదేశాలను కూడా తిరస్కరించింది. పించన్లను ప్రభుత్వమే వేరే ప్రత్యామ్నాయాల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించింది.

LEAVE A RESPONSE