Suryaa.co.in

Entertainment

ఆ అగ్ని పేరు కృష్ణ!

రగిలింది విప్లవాగ్ని ఈరోజు
ఆ అగ్ని పేరు
అల్లూరి సీతారామరాజు..
ఆయన మారుపేరు కృష్ణ..
ఘట్టమ’నేనే’ అల్లూరి..
అన్నట్టు ఆ వేషం సమకూరి..
సూపర్ స్టార్ కొట్టాడు
సూపర్ హిట్టు..
మరొకరు చెయ్యలేని స్ధాయిలో..
సినిమా స్కోప్ మీదొట్టు..!

దేవుడు చేసిన మనుషులు
సెంచరీ..
ఆ వేడుక ఆహ్వాన పత్రం..
కృష్ణ నూరవ చిత్రం
పద్మాలయా వారి
అల్లూరి సీతారామరాజు..
1974 మే 1..విడుదల..
అదో పెద్ద గోల..
నందమూరి కోపం..
వేడుకకి హాజరు కాని పరితాపం..
ప్రాజెక్టు ఆపేయమని రాయబారం..
ససేమిరా అంటూ
కృష్ణ హఠం..
మడమ తిప్పేదే లేదని అంతటి అన్నకే అల్టిమేటం..
మొత్తానికి సినిమా మొదలు..
అన్న సెగలు..
తర్వాత చాలా కాలానికి
అదే అన్న సినిమా చూసి
కృష్ణకి కితాబు..
మళ్లీ వెలిగిన అన్నదమ్ముల
అనురాగ మతాబు!

అల్లూరి రెండు ఠాణాలు ఒకేసారి కొల్లగొట్టాడట..
అందులో ఒకటి కృష్ణా..?
అన్నట్టు కుదిరింది
సూపర్ స్టార్ ఆహార్యం..
ఆయన ప్రదర్శించిన శౌర్యం..
వందేమాతరమంటూ నినదించిన బంగాళం..
స్వరాజ్యమ్ము జన్మహక్కని చాటించిన హిందోళం..
హింసకు ప్రతి హింసయన్న
వీరభూమి పాంచాలం..
అన్నిటికీ నెలవాయెను
ఆంధ్రవీర హృదయం..
ఈ రామరాజు హృదయం..
రాజు కనిపిస్తే
ప్రత్యేక మ్యూజిక్..
కృష్ణలో ముందెన్నడూ చూడని మ్యాజిక్..
అది అల్లూరి ఆవాహనమా
ఘట్టమనేని సమ్మోహనమా!
దుష్మన్ మే ఏక్ కో మార్నేసే
కుచ్ నహీ హోగా బుద్దూసింగ్ జీ..
హమ్ ఇన్ సబ్కో దేశ్ సే
హఠానా చాహియే..
ప్రతి పలుకులో ఆవేశం..
నిజంగా అది పరకాయప్రవేశం!

తానే నటుడై..నిర్మాతై..
మధ్యలో కొంత దర్శకుడై..
మొత్తంగా దార్శనికుడై..
ఎందరో పెద్దోళ్లకి స్కోపే లేని
సినిమాని స్కోపులో తీసిన
కృష్ణకి వందనం..
విప్లవం మరణించదు..
వీరుడు మరణించడు..
అనుకున్నది సాధించేదాకా
కృష్ణ విశ్రమించడు..
సవాళ్లు ఎదురైనా విరమించడు..
ఇందులో నో ఎక్సెస్..
అలా అయిందీ సినిమా సక్సెస్..అలాగే
బద్దలైంది బాక్సాఫీస్!

దిగి వచ్చిన గంటం దొర గుమ్మడి..
తెల్ల్లోళ్ళ తొత్తులు
అల్లు..సాక్షి..
అదరగొట్టేసిన పిళ్ళై..
మల్లు ప్రభాకరరెడ్డి..
పడాల్ కాంతారావు..
ఎస్సై రాజబాబు..
వస్తాడు నా రాజు అంటూ
జీవించి మరణించిన సీత
విజయనిర్మల..
అల్లూరి జిజియాబాయి
పండరీ బాయి..
ఎస్వీఆర్ అనుకున్న అగ్గిరాజు..ఆ లోటు తీర్చిన బాలయ్య..
అసలు ఈ సినిమాకి
మరో మూలం జగ్గయ్య..
రేడియోలో ఆయన ఇంగ్లీషు
వార్తలు వినని బ్యాడ్ లక్
ఈ సినిమాలో ఆయన లుక్
అచ్చం రూథర్ ఫర్డ్..
ఆ కంచు కంఠం..
ఆంగ్ల ఉచ్చారణ..
తెలుగు కూడా ఇంగ్లీషులాగే..
అదిరిన ప్రతి డైలాగే..
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అను పెద్ద గొలుసు నందు నీవొక చక్కని లింకు కావచ్చు..
అలా పలకడం
ఆయనకే వచ్చు..
Sorry mivola..
If i am ending a noble sole..for my country and my lord..shoot him
కొంగర కొరకొర..
ముగిసిన అల్లూరి చరిత..
సినిమా అయింది ఓ చరిత్ర!

తెలుగు వీర లేవరా..
దీక్ష బూని సాగరా..
సెగ పుట్టించిన
మహాకవి కలం…
ఆయనకు జాతీయ అవార్డుతో మురిసింది
నాటి కవికులం!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE